శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Modified: మంగళవారం, 18 జూన్ 2019 (20:47 IST)

'జై భీమ్.. అల్లాహ్ అక్బర్.. జై హింద్’... హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ప్రమాణం

లోక్ సభలో మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీగా ప్రమాణం చేస్తున్న సమయంలో ఓ ఆసక్తికర పరిణామం జరిగింది. ఆయన ఎంపీగా ప్రమాణం చేసేందుకు పోడియం వద్దకు రాగానే కొందరు భాజపా ఎంపీలు ‘జై శ్రీరామ్’, ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ప్రమాణం చేసేందుకు ముందుకు వచ్చిన అసదుద్దీన్ కూడా... అరవండి... అరవండి అంటూ చేతులతో సైగలు చేశారు. ఇది 17వ లోక్‌సభ సమావేశాల రెండో రోజైన మంగళవారం నాడు చోటుచేసుకుంది.
 
ఐతే అసదుద్దీన్ ప్రమాణం చేస్తూ... స్పీకర్ పోడియం ముందుకు వెళ్లి, వాళ్లను ఆపండి నేను ప్రమాణం చేస్తానని ప్రొటెం స్పీకర్‌కి విన్నవించారు. దీనితో హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సహచర ఎంపీలను వారించడంతో వారు కాస్త నినాదాల హోరు తగ్గించారు. దానితో ఆయన తన ప్రమాణాన్ని పూర్తి చేశారు. ఐతే చివర్లో అసదుద్దీన్... ‘జై భీమ్.. అల్లాహ్ అక్బర్.. జై హింద్’ అంటూ పూర్తి చేశారు. ఇపుడా వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. మీరూ ఓ లుక్కేయండి.