Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పడకసుఖం కోసం వెళ్లాడు... వేశ్యను ప్రేమించిన లారీ డ్రైవర్.. ఎక్కడ?

శుక్రవారం, 7 జులై 2017 (08:47 IST)

Widgets Magazine
prostitute tester

పడకసుఖం కోసం వేశ్య వద్దకు వెళ్లిన ఓ లారీ డ్రైవర్ ఆమె ప్రేమలో పడిపోయాడు. ఆ ప్రేమ అంతటితో ఆగక... ఆమెను పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు. సినిమా కథను తలపించేలా జరిగిన ఈ ఘటన ఢిల్లీ మహిళా కమిషన్, పోలీసుల చేయూతతో సుఖాంతంకానుంది. ఢిల్లీలోని ఓ వేశ్యావాటికలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
27 ఏళ్ల మహిళ నేపాల్ నుంచి పేదరికం తట్టుకోలేక ఢిల్లీకి వలస వచ్చి ఉపాధి కోసం చూస్తూ... జీబీరోడ్డులో వ్యభిచారిణిగా మారింది. అలాగే, ఢిల్లీలో డ్రైవరుగా పనిచేస్తున్న 28 ఏళ్ల యువకుడు నగరంలోని జీబీ రోడ్డులో ఉన్న ఓ వేశ్యావాటికలోని ఓ 27 ఏళ్ల వ్యభిచారిణి వద్దకు వెళ్లాడు. అంతే తొలి కలయికలోనే ఆ మహిళంటే మనసు పారేసుకున్నాడు. దీంతోపాటు వేశ్యావాటికలోని అమ్మాయి కూడా ఈయనంటే ఎంతో ఇష్టమని చెప్పింది. దీంతో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఈ వేశ్యావాటికకు తరచూ వెళుతూ తన ప్రేయసితో కలుస్తూ వచ్చాడు. 
 
అయితే ఆమెను ఆ వేశ్యావాటిక నుంచి విముక్తిరాలిని చేసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆ వ్యక్తి.. ఢిల్లీ మహిళా కమిషన్‌ను ఆశ్రయించడంతో వారు పోలీసుల సహకారంతో ఆ వ్యభిచారిణిని వేశ్యావాటిక నుంచి విముక్తి కల్పించారు. యువకుడి తల్లిదండ్రులు కూడా ఆ మహిళతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంతే ప్రేమికులిద్దరూ పెళ్లి ఏర్పాట్లలో మునిగారు. త్వరలో వారిద్దరు పెళ్లి చేసుకుంటారని ఢిల్లీ మహిళా కమిషన్ అధికారులు చెప్పారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నిర్లక్ష్యమే జయలలిత మృతికి ప్రధాన కారణం.. బాంబు పేల్చిన నటరాజన్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత తన ఆరోగ్యం విషయంలో ప్రదర్శించిన తీవ్ర ...

news

చదివింది 8వ క్లాస్, 15మంది మగ పిల్లలపై అత్యాచారం.. ఇప్పుడు హత్య కూడా.. వీడు మనిషేనా?

ఎనిమిదో తరగతివరకు చదివిన 17 సంవత్సరాల మైనర్ బాలుడు పొరుగున ఉన్న పదేళ్ల అబ్బాయిపై అసహజమైన ...

news

మాట్లాడను పో... చైనా.. మాట్లాడాలని అడిగామా.. భారత్ కౌంటర్‌తో దిమ్మతిరిగిన చైనా

జర్మనీలోని హాంబర్గ్‌లో జీ-20 సమావేశాలు శుక్రవారం నుంచి జరుగనున్న నేపథ్యంలో తమ ...

news

నెలకు రూ.100 ప్రీమియంతో రూ.2 లక్షలు... 1044 వ్యాధులకు చికిత్స... కామినేని

అమరావతి, జులై,6: రాష్ట్రంలో ప్రస్తుతం వైద్య,ఆరోగ్య శాఖలో అమలవుతున్న హెల్త్ ఇన్సూరెన్స్ ...

Widgets Magazine