శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 జనవరి 2021 (18:51 IST)

మధ్యప్రదేశ్‌: బాలికపై బ్యాంక్ మేనేజర్.. వీడియో తీసి..?

మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ బ్యాంక్‌ మేనేజర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఘటనకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడ్డాడు. ఇండోర్‌లో జరిగిన కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 
 
వివరాల్లోకి వెళితే మొహాలీకి చెందిన ఓ బాలికకు తన స్నేహితురాలి ద్వారా 53 ఏళ్ల బ్యాంక్‌ మేనేజర్ పరిచయమయ్యాడు. దాంతో అతడు ఆ బాలికను అప్పుడప్పుడు షాపింగ్‌కు తీసుకెళ్లేవాడు. ఈ నేపథ్యంలో షాపింగ్‌కు అని చెప్పి ఓ రోజు బాలికను హోటల్‌ గదికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాక అత్యచారం చేస్తూ వీడియో తీశాడు. 
 
ఆ తర్వాత కూడా వీడియో సోషల్ మీడియాలో పెడుతానని బ్లాక్‌ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో విసుగుచెందిన బాలిక చివరికి పోలీసులను ఆశ్రయించింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.