శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 నవంబరు 2021 (12:53 IST)

ప్రియురాలి ఖర్చుల కోసం కిడ్నాప్‌ డ్రామా.. తల్లిదండ్రులకే టోకరా!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భీండ్‌ జిల్లా గోహద్‌ ప్రాంతానికి చెందిన సందీప్ అనే యువకుడు తన ప్రియురాలి ఖర్చుల కోసం ఏకంగా కిడ్నాప్ డ్రామాకు తెరదీశాడు. తనను తానే కిడ్నాప్ చేసుకున్నాడు. ఆ తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.2.50 లక్షలు ఇస్తేనే మీ పిల్లోడిని వదిలివేస్తామని కిడ్నాపర్లు మాట్లాడినట్టుగా గొంతుమార్చి మాట్లాడాడు. చివరకు పోలీసులకు చిక్కడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
 
సందీప్ అనే యువకుడు తమ ప్రాంతానికే చెందిన ఓ యువతిని గాఢంగా ప్రేమించాడు. ఆమె కోసం ఖర్చు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో తానే కిడ్నాప్‌కు గురైనట్లు నాటకం ఆడాడు. కిడ్నాపర్‌లా గొంతమార్చి మాట్లాడుతూ తల్లిదండ్రులను నమ్మించాడు. కుమారుడిని విడిచిపెట్టాలంటే రూ.2.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. 
 
దీంతో ఈనెల 6న వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. సందీపే కిడ్నాపర్‌ అని వెల్లడైంది. అతని మొబైల్‌ నెట్‌వర్క్‌ లొకేషన్‌ ఆధారంగా పోలీసులు గ్వాలియర్‌లో సందీప్‌ ఆచూకీని గుర్తించి అరెస్టు చేశారు. కిడ్నాప్‌ డ్రామాపై యువకుడిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.