మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2020 (22:50 IST)

మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ.. 24 గంటల్లో కొత్తగా 14,888 కేసులు

corona virus
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. అటు మహారాష్ట్రలో కూడా కరోనా వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతీ రోజూ వేలల్లో కొత్త కేసులు, వందల్లో మరణాలు నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఆ రాష్ట్రంలో ప్రతిరోజూ వేలల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. 
 
తాజాగా మహారాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 14,888 కొత్త పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 295 మంది మృతి చెందారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,18,711కి, మరణాల సంఖ్య 22,794కి చేరింది. 
 
కాగా ఇప్పటి వరకు 5,22,427 మంది కోలుకోగా, ప్రస్తుతం 1,72,873 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇక కరోనా మరణాలు కూడా మహారాష్ట్రలో భారీగానే నమోదవుతున్నాయి. శనివారం కూడా కొత్తగా 295 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 22,794కు చేరింది.