Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లలో కోక్ జీరో అమ్మకాలపై ఎఫ్‌డీఏ నిషేధం.. ట్రంప్ వద్దు ఒబామానే కావాలి..

ఆదివారం, 19 మార్చి 2017 (11:00 IST)

Widgets Magazine

మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లలో కోక్ జీరో అమ్మకాలపై మహారాష్ట్ర ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌డీఏ) నిషేధం విధించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెక్‌డొనాల్డ్స్‌ శాఖల్లో నిషేధం వర్తిస్తుందని పేర్కొంది. కోక్ తయారీలో ప్రమాణాలు పాటించకపోవడంతో ఈ నిషేధం విధిస్తున్నట్లు వివరించింది. కార్బొనేటెడ్‌ నీటితో కోక కోలా జీరో తయారుచేయడం, ప్యాకింగ్‌, ఇతర వివరాలేమీ లేకుండా అమ్మడంపై ఎఫ్‌డీఏ అభ్యంతరం వ్యక్తం చేసింది.
 
ప్రపంచ ప్రఖ్యాత ఫాస్ట్‌ఫుడ్‌ రెస్టారెంట్‌ మెక్‌డొనాల్డ్స్‌ అధికారిక ట్విట్టర్‌ ఖాతా నుంచి వచ్చిన ఒక పోస్ట్‌ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ట్వీట్‌ కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. ఇంతకూ ఆ ట్వీట్‌లో ఏముందంటే ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా పనికిరాడని తమకు తిరిగి బరాక్‌ ఒబామానే అమెరికా అధ్యక్షుడిగా కావాలని ట్రంప్‌ విశాల హృదయుడు కాదని ఆ ట్వీట్‌ సారాంశం. అది చాలా వివాదాస్పదమైంది.
 
లక్షలాదిమంది ఆ ట్వీట్‌ను షేర్‌ చేశారు. అది కలిగించక సంచలనం చూశాక మెక్‌డొనాల్డ్స్ తన ఖాతానుంచి ఆ ట్వీట్‌ను తీసేసింది. ఆ ట్వీట్‌ తాము చేయలేదని ఎవరో తమ ట్విట్టర్‌ ఎకౌంట్‌ను హ్యాక్‌ చేసి అలాంటి ట్వీట్‌ చేశారని వివరణ ఇస్తూ క్షమాపణలు చెప్పింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

దీప భర్త కొత్త పార్టీ.. హర్యానాలోనూ అమ్మ క్యాంటీన్లు..

కొత్త పార్టీ పెడతానంటూ తన భర్త ప్రకటించడం తప్పని.. జయలలిత మేనకోడలు దీప వ్యాఖ్యానించారు. ...

news

భర్త వెనుక ఉండి కొందరు అసత్యపు ప్రచారాలు చేస్తున్నారు: దీప

దివంగత సీఎం ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌కు భర్త షాకిచ్చారు. తమపై వస్తున్న ...

news

యూపీ కొత్త సీఎంగా యోగి ఆదిత్యనాథ్... అయోధ్యలో రామాలయం నిర్మించేందుకేనా?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 312 అసెంబ్లీ సీట్లు సాధించి అపూర్వ విజయాన్ని చవిచూసింది భాజపా. ...

news

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయితే...? వామ్మో... అంటూ ట్వీటులే...

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఐతే యోగి ఆదిత్యనాథ్ సీఎం ...

Widgets Magazine