శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 నవంబరు 2019 (15:02 IST)

ప్రజల తీర్పును శిరసావహిస్తాం... ప్రతిపక్షంలో కూర్చొంటాం : శరద్ పవార్

మహాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించి, ప్రతిపక్షంలో కూర్చొంటామని ఎన్సీపీ చీప్ శరద్ పవార్ స్పష్టం చేశారు. దీంతో మహారాష్ట్రలో బీజేపీ - శివసేన ప్రభుత్వం ఈ నెల 8వ తేదీలోపు ఏర్పాటుకానుంది. 
 
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ స్పందించారు. బుధవారం మధ్యాహ్నం శరద్‌ పవార్‌ మీడియాతో మాట్లాడుతూ.. శివసేన - బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నట్టు చెప్పారు. 
 
ఎన్సీపీలు విపక్షంలోనే కూర్చుంటాయని శరద్‌ పవార్‌ స్పష్టం చేశారు. శివసేనతో ఎన్సీపీ చేతులు కలపదని ఆయన తేల్చిచెప్పారు. శివసేన - ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్న ప్రశ్నే లేదన్నారు. 
 
గత 25 ఏళ్ల నుంచి బీజేపీ - శివసేన కలిసి ఉన్నాయి. ఇవాళ, రేపో ఆ రెండు పార్టీలే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని పేర్కొన్నారు. ఒక వేళ బీజేపీ - శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే రాష్ట్రపతి పాలన తప్పదని హెచ్చరించారు. శివసేన నాయకుడు సంజయ్‌ రౌత్‌ ఇవాళ ఉదయం తనను కలిశారు అని శరద్‌ పవార్‌ చెప్పారు. అయితే ఈ సందర్భంగా త్వరలో జరిగే రాజ్యసభ సెషన్స్‌పై తనతో సంజయ్‌ చర్చించారని పేర్కొన్నారు. రాజ్యసభలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించామని శరద్‌ పవార్‌ స్పష్టం చేశారు.