సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2022 (09:23 IST)

ఫోన్ లిఫ్ట్ చేయగానే హల్లో అనొద్దు.. వందేమాత్రం అనండి... మహా సర్కారు పిలుపు

cellphone talking
సాధారణంగా ప్రతి ఒక్కరూ ఫోన్ లిఫ్ట్ చేయగానే హల్లో అంటూ పలుకరించడం ఆనవాయితీ. ఇకపై దీనికి బదులుగా వందేమాతరం అని పలకాలని మహారాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ వినూత్నమైన ప్రచార కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదివారం ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర మంత్రి సుధీర్ ముంగంటివార్ వెల్లడించారు. 
 
హల్లో అనే పదం ప్రాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింభిస్తుందని, ఆ పదానికి ఒక అర్థమేమీ లేదని ఆయన పేర్కొన్నారు. అదే వందేమాతరం అనే పలకడం ద్వారా ఆప్యాయతా భావం పెంపొందుతుందని వివరించారు. 
 
వందేమాత్రం అంటే తల్లి ముందు వినిమ్రంగా నిలబడి నమస్కరించడం వంటి అర్థమని తెలిపారు. కావాలంటే జైభీమ్, జైశ్రీరామ్ లేదా తమ తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పొచ్చవచ్చని కోరారు. హల్లో అనే పదం పలకడం మాత్రం మానుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
మరోవైపు, హల్లోకు బదులు వందేమాతరం అని పలకాలనే విషయానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్‌ను జారీచేసింది. అయితే, ఈ పలుకరించి తప్పనిసరి కాదని అందులే పేర్కొంది. ఉద్యోగులు ఈ విధానాన్ని అనుసరించేలా ఉన్నతాధికారులు కింది స్థాయి ఉద్యోగులను ప్రోత్సహించాలని మహారాష్ట్ర సర్కారు జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది.