బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 జులై 2023 (15:38 IST)

అజంతా గుహ ప్రాంతంలో సెల్ఫీ.. జలపాతంలో పడిపోయాడు..చివరికి?

Ajantha Caves
Ajantha Caves
అజంతా గుహ ప్రాంతంలో సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలో పడిపోయిన యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. గోపాల్ చవాన్ (30) మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లోని సోయిగావ్ తాలూకాకు చెందినవాడు. అక్కడి ప్రముఖ పర్యాటక ప్రదేశమైన అజంతా గుహకు తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. 
 
గుహ చుట్టుపక్కల పలు ప్రాంతాలకు వెళ్లి అక్కడి వ్యూ పాయింట్ జలపాతం దగ్గర ఆగి 'సెల్ఫీ' ఫోటో దిగేందుకు ప్రయత్నించాడు. అప్పుడు అనూహ్యంగా కాలు తప్పి జలపాతం సరస్సులో పడిపోయాడు. 
 
అయితే అదృష్టవశాత్తూ అక్కడే రాయిని పట్టుకుని ప్రాణాలతో పోరాడుతుండగా పోలీసులు గంటల తరబడి పోరాడి తాడు కట్టి ప్రాణాలతో కాపాడారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.