ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 జనవరి 2022 (08:18 IST)

సూపర్ మార్కెట్‌లో వైన్ విక్రయాలు... ఎక్కడ?

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వం గురువారం కొత్త వైన్ పాలసీని విడుదల చేసింది. ఈ విధానం మేరకు రాష్ట్రంలో తయారు చేసిన వైన్‌లను విక్రయించడానికి అన్ని సూపర్ మార్కెట్‌లను అనుమతించిందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పొరుగున ఉన్న మధ్యప్రదేశ్ తన అన్ని విమానాశ్రయాలలో మద్యం అమ్మకాలకు, నాలుగు ప్రధాన నగరాల్లో ఎంపిక చేసిన సూపర్ మార్కెట్‌లలో విక్రయిస్తున్నారు. అంతేకాకుండా యేడాదికి రూ.1 కోటి లేదా అంతకంటే ఎక్కువ సంపాదించే వారికి హోమ్ బార్ లైసెన్స్‌లను జారీ చేయడానికి అనుమతించిన వారం తర్వాత మహారాష్ట్ర కూడా ఈ తరహా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 
 
దీనిపై ఎన్సీపీ నేతే, మంత్రి నవాబ్ మాలిక్ మీడియాతో మాట్లాడుతూ, గత ఏడాది 20 తర్వాత రూపొందించిన కొత్త పాలసీ ప్రకారం బీర్లు మరియు ఇతర మద్యం కాకుండా, కనీసం 1,000 చదరపు అడుగులు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న సూపర్ మార్కెట్‌లు వైన్ విక్రయించడానికి అనుమతించబడతాయని చెప్పారు. దీంతో ఇప్పటివరకు అమల్లో వున్న 20 యేళ్ళ మద్యం పాలసీకి చెల్లుచీటి చెప్పారు. 
 
రాష్ట్రంలో దాదాపు నాలుగు డజన్ల వైన్ తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఇవి నాసిక్ జిల్లాలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి, ఇది భారతదేశంలో ఉత్పత్తి అయ్యే 80 శాతం వైన్‌ను కలిగి ఉంది, అహ్మద్‌నగర్, సాంగ్లీ, పూణే, షోలాపూర్, బుల్దానా వంటి ఇతర జిల్లాల్లో చిన్న వైన్‌ల తయారీ కేంద్రాలు ఉన్నాయి. దేశంలో అభివృద్ధి చెందుతున్న వైన్ పరిశ్రమ సుమారు రూ.1,000 కోట్ల విలువైన ఈ రంగంలో అగ్రగామిగా ఉన్న మహారాష్ట్ర, ఆదాయంలో దాదాపు మూడింట రెండు వంతుల వాటాను కలిగి ఉండటం గమనార్హం.