మహారాష్ట్రలో కరోనా విలయతాండవం.. వీకెండ్ లాక్‌డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ
మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజూ సరికొత్త రికార్డుతో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 57వేలకు మందికి కరోనా సోకింది. అయితే.. ఇప్పటికే వీకెండ్ లాక్‌డౌన్‌ను విధించి కరోనా కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. మరోవైపు.. షిర్డీలోని సాయిబాబా మందిరాన్ని మూసివేస్తున్నట్టు ఆలయవర్గాలు ప్రకటించాయి. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు శిర్డీ ఆలయానికి భక్తులు రావొద్దని వెల్లడించారు.
మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే వీకెండ్ లాక్‌డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ వంటివి అమల్లో ఉన్నాయి. అయితే.. మహారాష్ట్రలో బయటపడుతున్న బాధితుల్లో ఎక్కువ మంది యువతే ఉండడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారింది. అందుకే టీకా అర్హత వయసును 25 ఏళ్లకు తగ్గించాలని సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు యువతకు, పనిచేసే వయసులో ఉన్నవారికి త్వరగా వ్యాక్సిన్ అందిస్తే వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని పేర్కొన్నారు.