శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 31 మే 2017 (17:26 IST)

గోవును జాతీయ జంతువుగా ప్రకటించండి.. గోవధ చేస్తే జీవితఖైదు: రాజస్థాన్ హైకోర్టు

గోవధ, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షలపై కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో నిరసన గళాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్రానికి స

గోవధ, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వ ఆంక్షలపై కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో నిరసన గళాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. అంతేగాకుండా గోవధ చేసేవారికి ప్రస్తుతం మూడేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తున్నారని గుర్తు చేసింది. ఇంకా ఆవును చంపితే జీవితఖైదు విధించాలని రాజస్థాన్ హైకోర్టు కేంద్రానికి సిఫారసు చేసింది. 
 
పశువులను వధ కోసం కొనకుండా, అమ్మకుండా కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధంపై మద్రాస్ హైకోర్టు ఇప్పటికే నాలుగు వారాలు స్టే విధించిన తరుణంలో రాజస్థాన్ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీసింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తాము పట్టించుకునే ప్రసక్తే లేదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళ, త్రిపుర కూడా పశ్చిమ బెంగాల్ బాటలోనే నడుస్తున్నాయి.
 
పశువుల వధపై నిషేధం విధించిన విషయంపై దాఖలు అయిన పిటిషన్లను బుధవారం రాజస్థాన్ హైకోర్టు విచారించింది. రాజస్థాన్ రాజదాని జైపూర్ లో విచ్చలవిడిగా గో మాంసం విక్రయిస్తున్నారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్నతరువాత ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది.