గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2023 (21:15 IST)

కర్నాటక ఎన్నికల సమరం : గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే...

congressflags
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికలతో ముందుకుసాగుతోంది. విజయం కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసేందుకు ప్రత్యేకంగా ప్రచారకర్తలను నియమించింది. వీరిని స్టార్ క్యాంపెయినర్లుగా పేర్కొంటూ ఓ జాబితాను రిలీజ్ చేసింది. 
 
ఈ జాబితాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్, సిద్ధరామయ్య, తాజాగా బీజేపీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జగదీశ్ శెట్టర్, శశిథరూర్, కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, మునియప్ప, జి.పరమేశ్వర, ఎంబీ పాటిల్, హరిప్రసాద్, రణదీప్ సింగ్ సుర్జేవాలా, డీకే సురేశ్, సతీశ్ జర్కిహోలి, వీరప్ప మొయిలీలు ఉన్నారు. 
 
వీరితో పాటు రేవణ్ణ, అశోక్ చవాన్, పృథ్విరాజ్ చౌహాన్, రేవంత్ రెడ్డి, కన్నయ్య కుమార్, రాజ్ బబ్బర్, అజారుద్దీన్, దివ్యస్పందన, రమేష్ చెన్నితాల, పి.చిదంబరం, అశోక్ గెహ్లాట్, భూపేశ్ భాఘేల్, సయ్యద్ నజీర్ హుస్సేన్, రూపా శశిధర్ తదితరులు ఉన్నారు. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10వ తేదీన జరుగనుంది. మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు.