శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 24 నవంబరు 2023 (17:13 IST)

స్టేడియంకు పాపులు వెళ్లడం వల్లే భారత్ ఓడిపోయింది : మమతా బెనర్జీ

mamata benargi
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భారత క్రికెట్ జట్టు లీగ్ దశ నుంచి సెమీ ఫైనల్ మ్యాచ్ వరకు అన్ని మ్యాచ్‌లు గెలుచుకుంటూ వచ్చారని, ఫైనల్ మ్యాచ్‌కు మాత్రం స్టేడియానికి పాపులు వెళ్ళి టీమిండియాను ఓడించారని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఆటగాళ్ళు వేసుకునే జెర్సీలను కూడా కాషాయం రంగులో తయారు చేశారంటూ ఆమె మండిపడ్డారు. 
 
ఈ నెల 19వ తేదీన అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ను మోడీ స్టేడియంలో కాకుండా, లక్నోలో పెట్టివుంటే భారత్ గెలిచివుండేదని, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. తాజాగా ఇదే అంశంపై వెస్ట్ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా స్పందించారు.
 
ప్రపంచ కప్ ప్రతి మ్యాచ్‌లో భారత్ గెలిచింది. కానీ ఫైనల్స్‌కు పాపులు వచ్చారని, ఫైనల్స్‌ ఓడిపోవడానికి ఆ పాపులు మ్యాచ్‌కు రావడమే కారణమని మమత విమర్శించారు. అహ్మదాబాద్‌లో కాకుండా ముంబైలోని వాంఖడే స్టేడియంలోగానీ, కోల్‌‍కతా ఈడెన్ గార్డెన్స్‌లోగానీ ఫైనల్ మ్యాచ్ నిర్వహించివుంటే భారత్ ఖచ్చితంగా విశ్వవిజేతగా నిలిచేదిని వెల్లడించారు. దేశాన్ని కాషాయమయం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందని మమత విమర్శించారు. భారత్ ప్రాక్టీస్ చేసే సమయంలో ధరించే జెర్సీలను కూడా కాషాయ రంగులో తయారు చేశారని, తద్వారా జట్టును కూడా కాషాయికరించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.