Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సెల్‌ఫోన్ ఛార్జ్ కోసం ఇంటికొచ్చి రేప్ చేయబోయాడు.. బిగ్గరగా కేకలు పెట్టడంతో నిప్పంటించాడు..

బుధవారం, 28 జూన్ 2017 (16:06 IST)

Widgets Magazine

అత్యాచారానికి సహకరించలేదన్న పాపానికి ఓ యువకుడు ఓ యువతికి నిప్పంటించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. యూపీకి చెందిన ఓ యువకుడు యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. కానీ ఎంతసేపటికీ ఆ యువతి ప్రతిఘటించడంతో పాటు బిగ్గరగా కేకలు పెట్టడంతో ఆగ్రహానికి గురైయ్యాడు. అంతే  యువతిని నిప్పుకు ఆహుతి చేశాడు. 
 
వివరాల్లోకి వెళితే.. యూపీలోని షాహిగణేష్‌పూర్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువతి ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన.. అదే ప్రాంతానికి చెందిన యువకుడు సెల్ ఫోన్ ఛార్జ్ కోసమంటూ వెళ్లాడు. ఆ యువతి కూడా అతనిని నమ్మి సెల్ ఫోన్ తీసుకుని ఇంట్లోకి వెళ్లింది. దీన్ని అదనుగా తీసుకున్న యువకుడు ఇంట్లోకి ప్రవేశించి.. తలుపులేసుకున్నాడు. ఆపై ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. 
 
అయితే ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆవేశానికి గురైన యువకుడు యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించి పారిపోయాడు. యువతి కేకలు విన్న స్థానికులు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. అయితే చికిత్స ఫలించక యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న యువకుడి కోసం గాలిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ట్రంప్ కడుపులో పండు పెట్టుకుని మోదీని ఆలింగనం చేసుకున్నారు... నారాయణ(వీడియో)

మోడీ, ట్రంప్‌ల కలయిక చూస్తుంటే సుధీర్ఘ కాల గాఢ ప్రేమికుల్లా కనిపిస్తున్నారని సిపిఐ జాతీయ ...

news

శివాజీ... అనంతపురం నుంచి నేను.. అమరావతి నుంచి నీవు... పని ప్రారంభిద్దాం... పవన్ కళ్యాణ్

నటుడు శివాజీ. మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటిస్తూ ఒక్కసారిగా హీరోగా అవకాశం ...

news

కుమారుడిని చంపేసినా దోషులను వదిలిపెట్టేయమన్న తండ్రి.. వారు కూడా..?

తన కుమారుడిని హతమార్చిన దోషులను ఓ తండ్రి పెద్ద మనసుతో వదిలిపెట్టేయాల్సిందిగా కోర్టును ...

news

చనా దాల్‌కు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చోటుదక్కింది..

ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులో భారతీయ పప్పు ధాన్యం శెనగపప్పుకు స్థానం లభించింది. ...

Widgets Magazine