గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 8 జులై 2017 (05:55 IST)

సుఖం కోసం వచ్చాడు.. చూసి వలచాడు... బయటకు లాగాడు.. మంచిదే కానీ...

వేశ్యవృత్తిలో ఉన్నామెను ప్రేమిస్తున్నానంటూ హీరో వెంటపడటం, ఆమెను ఒప్పించి తీసుకెళ్లిపోవడం, పెళ్లి చేసుకోవడం ఇది ఆ సినిమా కథ. అచ్చ ఆ సినిమాలోలానే న్యూఢిల్లీలోని వేశ్యావాటికలో సంఘటన జరిగింది. ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మలివాల్ చొరవతో ఈ కథ సుఖాం

వేశ్యవృత్తిలో ఉన్నామెను  ప్రేమిస్తున్నానంటూ హీరో వెంటపడటం, ఆమెను ఒప్పించి తీసుకెళ్లిపోవడం, పెళ్లి చేసుకోవడం ఇది ఆ సినిమా కథ. అచ్చ ఆ సినిమాలోలానే న్యూఢిల్లీలోని వేశ్యావాటికలో సంఘటన జరిగింది. ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మలివాల్ చొరవతో ఈ కథ సుఖాంతమయ్యింది. ఢిల్లీలో డ్రైవర్‌గా పని చేసే ఓ 28 ఏళ్ల యువకుడు రెండేళ్ల కిందట గారిస్టన్ బాస్టిన్ రోడ్డులోని ఓ వేశ్యావాటికకు వెళ్లాడు. ఉపాధి కోసం నేపాల్ నుంచి ఇండియాకు వచ్చిన ఆ యువతి వేశ్యగా మారిన 27 ఏళ్ల యువతిని కలిశాడు. విటుడిగా వెళ్లినప్పటికీ, తొలి చూపులోనే ఆమెను ఇష్టపడ్డాడు.
 
ఆనాటి నుంచి ఆమె కోసం రోజూ వేశ్యా గృహానికి వెళ్లి వచ్చేవాడు. ఈ తంతు దాదాపు రెండేళ్ల పాటు సాగింది. తన ప్రేమ విషయం తెలియజేయడంతో ఆమె కూడా అంగీకారం తెలిపింది. రెండేళ్ల నుంచి ప్రేమలో ఉన్న యువకుడు తమకు సాయం చేయాలని ఢిల్లీ మహిళా కమిషన్‌ను ఆశ్రయించాడు.  2015లో నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం తర్వాత ఆమె ఢిల్లీకి రాగా, ఓ వ్యక్తి మోసం చేసి వేశ్యా గృహానికి అమ్మేశాడని మహిళా కమిషన్‌ అధికారులకు వివరించాడు. 
 
మహిళా కమిషన్‌ చైర్మన్ స్వాతి మలివాల్ పోలీసుల సాయంతో దాడులు చేసి ఆమెకు విముక్తిని కల్పించారు. అతి త్వరలో వీరిద్దరికీ వివాహం జరిపించనున్నామని స్వాతి మలివాల్ ప్రకటించారు. జీబీ రోడ్డులోని ఇరుకు గదులలో సాగుతున్న వ్యభిచార దందాలను అడ్డుకునేందుకు మరిన్ని దాడులు చేయనున్నామని అన్నారు. మహిళలను అక్రమంగా తరలించే వ్యభిచార ముఠాల ఆటకట్టిస్తామని తెలిపారు.
 
ఇంతవరకు బాగానే ఉంది. కానీ కొత్త జీవితం గడిపే క్రమంలో ఈ ప్రేమికులకు మనస్పర్థలు ఏర్పడి తమ గతం గురించి తవ్వుకున్నారంటే కథ మళ్లీ మొదటికి వస్తుంది. అన్నీ సక్రమంగా ఉన్న దాంపత్యాలే నోటి మాటల తీటకు బలై విచ్ఛిన్నమైపోతున్న ఘటనల్ని వందలాదిగా చూస్తున్నాం. తన నోటి విషయంలో ఈ దంపతులూ కాస్త జాగ్రత్తగా ఉంటే జీవితం సాఫీగా గడుస్తుందనటంలో సందేహమే లేదు మరి.