Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పడకగదిలో బాయ్‌ఫ్రెండ్‌తో కూతురు.. తండ్రి గుండె ఆగిపోయింది.. అయినా పశ్చాత్తాపం లేదు

బుధవారం, 10 జనవరి 2018 (09:10 IST)

Widgets Magazine
lovers romance

ప్రేమపై మోజుతో కన్నతండ్రి చనిపోయినా ఓ యువతి పట్టించుకోలేదు. కంటికి రెప్పలా కాపాడుకున్న తండ్రి తన వల్లే చనిపోయినా ఆ యువతిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు. అర్థరాత్రి పూట బాయ్‌ఫ్రెండ్‌తో గదిలో వున్న కన్నకూతురుని చూసి ఆ తండ్రి గుండె ఆగిపోయింది. ఆ సన్నివేశాన్ని చూసి షాక్ అయ్యాడు. కన్నకూతురితో వున్న వ్యక్తితో గొడవ పడ్డాడు. 
 
ఇంటి నుంచి వెళ్లిపొమ్మన్నాడు. అయితే బాయ్‌ఫ్రెండ్ తండ్రిని మెట్లపై తోసి దాడి చేసినా ఆ కూతురు మనస్సు బండరాయిలా నిలిచిపోయింది. చివరికి చికిత్స పొందుతూ ఆ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నోయిడాలోని అట్టా గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే అట్టా గ్రామానికి చెందిన విశ్వనాథ్ సాహు (45) ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. కుమార్తె పూజ (21), భార్య గాయత్రితో కలిసి ఓ భవనంలోని మూడో అంతస్తులో నివసిస్తున్నాడు. వీరి ఇంటి పక్కనే ఉండే ధర్మేంద్ర (24)తో పూజకు ఏడాది కాలంగా పరిచయం ఉంది. 
 
ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో కుమార్తె గదిలో ఏదో అలికిడి వినిపించడంతో విశ్వనాథ్ లేచి ఆమె గదిలోకి వెళ్లాడు. అక్కడ ధర్మేంద్ర కనిపించడంతో విస్తుపోయాడు. అతడితో గొడవపడ్డాడు. అక్కడి నుంచి వెళ్లిపొమ్మన్నాడు. ఈ క్రమంలో ఏర్పడిన ఘర్షణతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో విశ్వానాథ్ కిందికి వస్తూ పట్టు తప్పి మెట్లపై నుంచి జారి కిందపడ్డాడు.
 
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విశ్వనాథ్ ప్రాణాలు కోల్పోయాడు. విశ్వనాథ్ భార్య గాయత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూజను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ధర్మేంద్ర కోసం గాలిస్తున్నారు. తండ్రి చనిపోయినా కుమార్తె పూజలో ఎటువంటి పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులు వెల్లడించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రాష్ట్రంలోనే కడపలో ఆ గ్రామంలోని ప్రజలు బాగా డబ్బున్నవారు...

‘జనంలో చైతన్యం, సమాజాభివృద్ధికి సమాయత్తం చేయడమే జన్మభూమి-మా వూరు లక్ష్యంగా’ ముఖ్యమంత్రి ...

news

భార్యను చూసి భర్తకు గుండెపోటు... ఎందుకంటే?

అతడో కాకలు తీరిన గ్యాంగస్టర్. అంతేకాదండోయ్... వరుసగా ఐదుసార్లు గెలిచిన ప్రజాప్రతినిధి. ...

news

బాలక్రిష్ణను ఓడించేందుకు వ్యూహం పన్నుతున్న యువ ఎంపి...

నందమూరి బాలక్రిష్ణ. హిందూపురం ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని ...

news

అత్యద్భుతం : సహారా ఎడారిని కప్పేసిన మంచు దుప్పటి (వీడియో)

ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారిగా పేరుగాంచిన సహారా ఎడారిని మంచుదుప్పటి కప్పేసింది. ఇది ...

Widgets Magazine