గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 ఫిబ్రవరి 2020 (15:33 IST)

మరదలు స్నానం చేస్తుంటే వీడియో తీసి వాట్సాప్‌లో భార్యకు పంపాడు..

తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో భార్యతో ఏర్పడిన తగాదాల కారణంగా మరదలు స్నానం చేస్తుంటే వీడియో తీసి.. ఆ వీడియోను భార్యకు.. ఆమె కుటుంబీకులకు పంపిన కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. చెన్నై వలసరవాక్కంకు చెందిన దినేష్ ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. అతనికి వివాహమై ఏడేళ్ల కుమారుడు వున్నాడు. 
 
మద్యానికి బానిసైన ఇతడు భార్యతో అప్పుడప్పుడు తగాదాకు దిగేవాడు. ఈ కారణం చేత దినేష్ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో ఆవేశానికి గురైన దినేష్ తన అత్తారింటికి షాకివ్వాలనుకున్నాడు. ఇంకా భార్యను బ్లాక్ మెయిల్ చేసి కాపురానికి రప్పించాలనుకున్నాడు. 
 
ఇందులో భాగంగానే మరదలి స్నానం చేసే వీడియో తన వద్ద వుందని.. కాపురానికి రాకపోతే.. ఆ వీడియోను ఆమె కుటుంబ సభ్యులకు, సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడు. చెప్పినట్లే.. దినేష్ తన మరదలి స్నానపు వీడియోను భార్యకు, ఆమె బంధువులకు వాట్సాప్ ద్వారా పంపాడు.
 
దీంతో షాకైన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దినేష్‌ను అరెస్టు చేశారు. ఆ వీడియోను మరదలు అక్క ఇంటికి వచ్చినప్పుడు ఆమెకు తెలియకుండానే తీసినట్లు దినేష్ ఒప్పుకున్నాడు.