శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 జులై 2020 (12:13 IST)

ప్రియురాలి ముఖంపై శానిటైజర్ చల్లి... లైటర్‌తో తగలబెట్టేశాడు... ఎక్కడ?

చండీగఢ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన ప్రియురాలి ముఖంపై శానిటైజర్ చల్లిన ఓ ప్రియుడు.. లైటర్‌తో తగులబెట్టి చంపేశాడు. దీనికి కారణం కేవలం 2 వేల రూపాయలు ఇవ్వలేదన్న అక్కసుతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చండీగఢ్ రాష్ట్రంలో కిరాతకుడు తన ప్రియురాలిని రూ.2 వేలు ఇవ్వాలని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆమె ముఖంపై శానిటైజర్‌ చల్లి.. లైటర్‌తో నిప్పు అంటించాడు. 
 
ఈ ఘటనలో ఆమె ముఖం 20 శాతం కాలిపోయిందని పోలీసులు తెలిపారు. ఆమె ఆర్తనాదాలు విన్న ఇరుగు పొరుగు వారు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారని తెలిపారు. కేవలం డబ్బుల కోసమే అతడు ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని వారు చెప్పారు. 
 
కాగా.. బాధితురాలి వాగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసుకున్నారు. డబ్బుల కోసం అతడు బాధితురాలిని తరచూ వేధించేవాడంటూ బాధితురాలు ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని వారు అదుపులోకి తీసుకున్నారు.