గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 జులై 2022 (11:43 IST)

కర్ణాటకలో ప్రేత వివాహం-మరణించిన 30 ఏళ్ల తర్వాత పెళ్లి (video)

Marriage
Marriage
కర్ణాటకలో ప్రేత వివాహం నిర్వహించే సంప్రదాయం ఉంది. ఇందులో భాగంగానే జులై 28న 30 ఏళ్ల క్రితం మరణించిన వారికి పెద్దలు ఎంతో బాధ్యతగా పెళ్లి చేశారు. ఇది కాన్పు సమయంలో మరణించే పిల్లలకు పెళ్లి చేసే ఆనవాయితీగా వస్తోంది. కన్నడ, కేరళలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ అమలు అవుతుంది. 
 
కాన్పు సమయంలో ఓ మగ శిశువు మరణిస్తే.. ఆ మగ శిశువు మరణించి 20 ఏళ్లు దాటిన తర్వాత.. కాన్పు సమయంలో మరణించిన ఆడ శిశువుతో పెళ్లి చేస్తారు. 
 
ఇక్కడ పెళ్లి సంబంధం చూడటం, ఎంగేజ్‌మెంట్ మొదలు.. పెళ్లి చేసి అప్పగింతలు, బారాత్ వరకూ ప్రతీ తంతు నిర్వహిస్తారు. ఇటీవలే జరిగిన ఓ పెళ్లి వేడుకను యూట్యూబర్ ఆనీ అరుణ్ వీడియోల రూపంలో ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో తెగ వైరల్ అయింది.
 
చనిపోయిన వారి పెళ్లే కదా.. చాలా సింపుల్ అని భావిస్తే మాత్రం పొరపాటే. ఎందుకంటే.. మరణించినప్పటికీ వారికి పర్ఫెక్ట్ భాగస్వామినే వెతుకుతారు.