1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2024 (08:48 IST)

రాజ్యసభ నుంచి మన్మోహన్ సింగ్ రిటైర్... 33 యేళ్ల తర్వాత..

manmohan singh
మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజ్యసభ నుంచి రిటైర్ అయ్యారు. 33 యేళ్లుగా ఆయన రాజ్యసభ్యుడుగా సుధీర్ఘకాలం కొనసాగుతూ వచ్చారు. ఆయన పదవీకాలం ముగిసిపోయింది. ఆయనతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి ముగిసిన పలువురి రాజ్యసభ పదవీకాలం కూడా ముగిసిపోతుంది. అదేసమయంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తొలిసారి పెద్దల సభలోకి అడుగుపెట్టనున్నారు. మంగళవారంతో పలువురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగిసింది. ఇందులో మన్మోహన్ సింగ్ ఉన్నారు. 
 
తెలుగు రాష్ట్రాల నుంచి చూస్తే టీడీపీ నుంచి కనకమేడల రవీంద్రకుమార్, బీఆర్ఎస్ నుంచి జోగినపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, వైకాపా నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి సీఎం రమేష్‌లు ఉన్నారు. మన్మోహన్ సింగ్ సహా 54 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం నేటితో ముగిసింది. ఇందులో తొమ్మిది మంది కేంద్ర మంత్రులు ఉండటం గమనార్హం. రాజ్యసభకు తొలిసారి వెళుతున్న సోనియా గాంధీ తొలిసారి రాజస్థాన్ నుంచి తొలిసారి రాజ్యసభలోకి అడుగుపెడుతున్నారు. కాగా, మన్మోహన్ సింగ్ గత 1991 నుుంచి 1996 వరకు మధ్య పీవీ నరసింహా రావు ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా ఉన్నారు.
 
కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు రేపు, ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పదిమంది కొత్త సభ్యులతో చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఎల్లుండి మరో 11 మందితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.