శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 11 జనవరి 2020 (12:32 IST)

కేరళలో 800 కేజీల పేలుడు పదార్థాలతో హోలీ పెయిత్ బిల్డింగ్ నేలమట్టం (Video)

కేరళ రాష్ట్రంలో ఉన్న అక్రమ కట్టడాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో కేరళ ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. ఇందులోభాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్రమకట్టడాలను కూల్చివేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. తొలుత హోలీ ఫెయిత్ పేరుతో నిర్మితమైన బహుళ అంతస్తుల భవాన్ని శనివారం నేలమట్టం చేసింది. ఇందుకోసం 800 కేజీల పేలుడు పదార్థాలను కూల్చివేసింది. 
 
ఈ భవనం మ‌రాడు మున్సిపాల్టీలో ఉంది. ఈ భవనంతో పాటు మరో ఐదు భారీ అపార్ట్‌మెంట్లను కూల్చివేయనుంది. శనివారం ఉద‌యం 11 గంట‌ల‌కు మ‌రాడు ఫ్లాట్ల‌ను ధ్వంసం చేశారు. హోలీ ఫెయిత్ బిల్డింగ్‌ను పేలుడు ప‌దార్థాల‌తో కూల్చేశారు. రెండు రోజుల పాటు కూల్చివేత‌లు కొన‌సాగ‌నున్నాయి. ఆదివారం కూడా మ‌రికొన్ని బిల్డింగ్‌ను కూల్చివేయ‌నున్నారు. 
 
అదేవిధంగా కొచ్చి తీర ప్రాంతంలో అక్ర‌మంగా బిల్డింగ్‌లు నిర్మించిన‌ట్లు మరాడు సంస్థ‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల‌తోనే అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చివేస్తున్నారు. కేర‌ళ కోస్ట‌ల్ రెగ్యులేష‌న్ జోన్ ఆధ్వ‌ర్యంలో కూల్చివేత ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ది. ఆల్ఫా సెరీన్ బిల్డింగ్‌ను కూడా కూల్చ‌నున్నారు. అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత‌.. రియ‌ల్ ఎస్టేట్ మాఫియాకు చెంప పెట్టు అని భావిస్తున్నారు. ప‌ర్యావ‌ర‌ణ ఆంక్ష‌ల‌ను ఉల్లంఘించి.. బిల్డింగ్‌ను నిర్మిస్తే ఇలాగే ఉంటుందని పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు.