శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 10 ఆగస్టు 2017 (12:05 IST)

భార్యతో భర్త జరిపే శృంగారం అత్యాచారం కిందకు రాదు: సుప్రీం కోర్టు

భార్యతో భర్త జరిపే శృంగారం అత్యాచారం కిందకు రాదు. భార్యతో భర్త బలవంతంగా శృంగారంలో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వివాహంతో పని లేకుండా శృంగారానికి సమ్మతించే వ

భార్యతో భర్త జరిపే శృంగారం అత్యాచారం కిందకు రాదు. భార్యతో భర్త బలవంతంగా శృంగారంలో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వివాహంతో పని లేకుండా శృంగారానికి సమ్మతించే వయసును 18 ఏళ్లు గా నిర్ధారించాలని, ఆలోపు వయసున్న అమ్మాయిలతో భర్తే శృంగారంలో పాల్గొన్నా.. రేప్‌గానే పరిగణించాలని ఇండిపెండెంట్‌ థాట్‌ అనే స్వచ్ఛంద సంస్థ 2013లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 
 
దీనిపై ఇప్పటికే పార్లమెంట్‌లో చర్చ సాగిన విషయాన్ని సుప్రీం కోర్టు గుర్తు చేసింది. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 375లో రెండో క్లాజు ప్రకారం 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న భార్యతో భర్త జరిపే శృంగారం అత్యాచారం కిందికి రాదు. దీన్ని ఇండిపెండెంట్ థాట్ సవాలు చేసింది. 
 
శృంగారానికి సమ్మతి ఇవ్వదగ్గ వయసును 18 ఏళ్లుగా నిర్ధారించాలని, ఆలోపు వయసున్న అమ్మాయిలతో భర్తే శృంగారంలో పాల్గొన్నా.. రేప్‌గానే పరిగణించాలని ఆ సంస్థ కోరింది. అయితే ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం 15ఏళ్లలోపు అమ్మాయిలతో సమ్మతితో శృంగారంలో పాల్గొన్నా.. అది రేప్‌ కిందకే వస్తుందని, 15-18 ఏళ్లలోపు వివాహితల సమ్మతితో వారి వారి భర్తలు శృంగారంలో పాల్గొంటే అది అత్యాచారం కిందికి రాదని స్పష్టం చేసింది. ఈ అంశంపై పార్లమెంటు విస్తృతంగా చర్చించి, అది అత్యాచారం కిందికి రాదని అభిప్రాయపడింది.