1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2016 (14:45 IST)

ఎంఎన్ఎస్ కార్యకర్తలు అరేబియా సముద్రపు ఉప్పనీరు తాగే గూండాలు : మార్కండేయ కట్జూ

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ నటీటులపై భారత్ తీవ్ర చర్చ, రచ్చ సాగుతోంది. దేశంలో అడుగుపెడితే వారిపై దాడి చేస్తామంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ్ సే (ఎంఎన్ఎ

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ నటీటులపై భారత్ తీవ్ర చర్చ, రచ్చ సాగుతోంది. దేశంలో అడుగుపెడితే వారిపై దాడి చేస్తామంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ్ సే (ఎంఎన్ఎస్) హెచ్చరికలు చేస్తోంది. వీటిపై కట్జూ స్పందించారు. 
 
"నిస్సహాయంపు ఆర్టిస్టులపై ఎంఎన్ఎస్ ఎందుకు దాడిచేస్తుంది? ఒకవేళ ధైర్యముంటే నా ముందుకు రండి. మీ అసహనానికి నా దగ్గర దండన ఉంది. మీ కోసమే ఈ దండన వేచిచూస్తున్నట్టు" బుధవారం పలు ట్వీట్లు చేశారు. ఎంఎన్ఎస్ ప్రజలు అరేబియన్ సముద్రపు ఉప్పు నీరు తాగే గూండాలని వ్యాఖ్యానించారు. తాను గంగా, యమునా, సరస్వతి త్రివేణి సంగమం పవిత్రమైన నీరు తాగే అలహాబాదీ గూండానని పేర్కొన్నారు.
 
తన ముందుకు వస్తే ఎవరు అతిపెద్ద గూండానో తేల్చుకుందామని సవాలు విసిరారు. ఒక్క ఎంఎల్ఏ పార్టీ ఎంఎన్ఎస్ వారి పాఠాలను వారే నేర్చుకోలేకపోతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో జీరో-ఎంఎల్ఏ పార్టీగా ఎంఎన్ఎస్ నిలుస్తుందని ట్వీట్ చేశారు.