Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాజస్థాన్‌లో సెక్స్ రాకెట్ గుట్టురట్టు... అడ్వకేట్లు.. అధికారులు అరెస్టు?

గురువారం, 18 మే 2017 (08:14 IST)

Widgets Magazine
sex rocket

రాజస్థాన్‌ రాష్ట్రంలో వెలుగు చూసిన భారీ సెక్స్ రాకెట్‌లో పెద్ద తలలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో అమ్మాయిలతో పాటు అరెస్టు అయిన వారిలో అడ్వకేట్లు, అధికారులు కూడా ఉన్నారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన షికా తివారీ అనే యువతి ముంబైలోని ఓ హోటల్‌లో డీజేగా పని చేస్తోంది. ఈమె సారథ్యంలోని కొంతమంది అమ్మాయిలతో సెక్స్ గ్యాంగ్ ఏర్పాటైంది. ఈ క్రమంలో జైపూర్‌కు చెందిన ఓ ప్రముఖ డాక్టర్‌ను ట్రాప్‌ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడింది. దీంతో రంగంలోకి దిగిన స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ ఆమెను అదుపులోకి తీసుకున్నారు.   
 
ఈ సెక్స్ రాకెట్ గ్యాంగ్‌కు చెందిన యువతులు సంపన్నులతో పరిచయం చేసుకోవడం, ఆ తర్వాత క్లోజ్‌గా మూవ్‌ అవ్వడం. అనంతరం రూమ్‌కి పిలిచి, వారితో ఏకాంతంగా గడిపి, రేప్‌ కేసు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడటం ఈ గ్యాంగ్‌ స్టైల్‌. ఈ సెక్స్‌ రాకెట్‌ గ్రూప్‌ దాదాపు ఏడాది నుంచి తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తేలింది. 
 
ఈ గ్యాంగ్ ఇప్పటివరకు సుమారు రూ.20 కోట్లకుపైగా అక్రమ వసూళ్లకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఆరుగురు యువతులతో సహా మొత్తం 33న మందిని స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ అరెస్ట్‌ చేసింది. అరెస్టయిన వారిలో ఆరుగురు లాయర్‌లు కూడా ఉన్నారు. అంతేకాకుండా, పలువురు రాజకీయ నేతలు కూడా ఈ సెక్స్ రాకెట్ బాధితుల్లో ఉన్నట్టు సమాచారం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నీవు లేకపోతే బతకలేనన్నాడు... నమ్మి వెంట నడిస్తే ఫ్రెండ్‌తో కలిసి రేప్ చేశాడు... ఎక్కడ?

తెలంగాణా రాష్ట్రంలో ఇద్దరు మైనర్ బాలికలు కామాంధులు చేతిలో మోసపోయారు. ప్రేమిస్తున్నానని ...

news

అణు బాంబుకు ఉత్తర కొరియా సిద్ధం.. అమెరికాకు ముచ్చెమటలు!

ఉత్తర కొరియా నియంత, ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పెను విపత్తుకు కారణమయ్యేలా ఉన్నాడు. ...

news

సొంత పార్టీ పెట్టడమా, దేంట్లో అయినా కలిసిపోవడమా.. ఇదే రజనీ డైలమ్మా.. రావటం మాత్రం ఖాయమట

దాదాపు రెండు దశాబ్దాలపైగా తన రాజకీయ అవతారంపై అబిమానులను ఊరిస్తూ వస్తున్న దక్షిణాది సూపర్ ...

news

వీడికేం పోయేకాలం ద్యావుడా.. వండే కూరను బట్టి ఇల్లు ఇస్తానంటాడు.

బ్రిటన్‌లో ఒక సంపన్న ప్రబుద్ధుడు భారత, పాకిస్తాన్ జాతీయులకు చస్తే కూడా తన ఇళ్లను అద్దెకు ...

Widgets Magazine