సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 14 నవంబరు 2022 (17:21 IST)

బాలికపై అత్యాచారం చేసి.. ప్రైవేట్ భాగాలు కోసేసిన కామాంధులు

murderer
బీహార్ రాష్ట్రంలో అమానవీయ ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కొందరు కామాంధులు ఆ తర్వాత ఆ బాలిక ప్రైవేట్ భాగాలు, నాలుకను కోసేశారు. ప్రస్తుతం ఈ బాలిక పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ దారుణం ఈ నెల 11వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
బీహార్ రాష్ట్రంలోని కళ్యాణ్‌పూర్‌కు చెందిన ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ బాలికను కొందరు దుండగులు పక్కనే ఉన్న ఓ తోటలోకి తీసుకెళ్లారు. అక్కడ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తమ కామవాంఛ తీర్చుకున్న తర్వాత ఆ బాలిక ప్రైవేటు భాగాలతో పాటు నాలుకను విచక్షణారహితంగా కోసివేసి, అక్కడ నుంచి పారిపోయారు. 
 
ఆ బాలికకు రక్తస్రావం కావడంతో అపస్మారకస్థితిలోకి జారుకుంది. అయితే, ఆ బాలికను గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీపీఐ ఎంఎల్ నేతలు బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితులను పోలీసులు తక్షణం అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.