స్మార్ట్ ఫోన్ ఆడుకునేందుకు ఇవ్వలేదని తమ్ముడిని అలా చంపేసింది..
స్మార్ట్ ఫోన్లు మానవ జీవితాన్ని శాసిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ లేనిదే చిన్నా పెద్దలకు పొద్దు గడవడం లేదు. పిల్లలైతే స్మార్ట్ ఫోన్లతో గేమ్‌లతో కాలం గడిపేస్తున్నారు. పెద్దలైతే రకరకాల వీడియోలు చూస్తూ.. సోషల్ మీడియాలో గంటలు గంటలు వెచ్చిస్తున్నారు.
స్మార్ట్ ఫోన్ కోసం ఏదైనా చేసేందుకు రెడీ అవుతున్నారు.. కొంతమంది పిల్లలు. హర్యానాలో స్మార్ట్ ఫోన్ కోసం తమ్ముడినే ఓ సోదరి హత్య చేసింది. కుమారుడికి తల్లిదండ్రులు ఫోన్ కొనిపెట్టారు. కానీ అతడు సోదరికి ఫోని ఇవ్వమని అడిగితే ఇవ్వలేదు.
అంతే ఆవేశానికి గురైన అతడి సోదరి గొంతు నులిమి హత్య చేసింది. తల్లిదండ్రులకు తన తమ్ముడంటేనే ఎక్కువ ఇష్టమని భావించిన ఈ మైనర్ బాలిక.. తమ్ముడిని గొంతు నులిమి చంపేసింది. హరియాణాలోని బల్లభ్‌ఘడ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలిక, ఆమె తమ్ముడు ఉత్తరప్రదేశ్‌లో తమ నానమ్మ, తాతయ్యల దగ్గర ఉంటున్నారు.
ఇటీవల వేసవి సెలవుల కోసం తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు బాలుడికి ఓ మొబైల్ ఫోన్ కొనిచ్చారు. అయితే, మంగళవారం బాలుడు తన ఫోన్‌లో గేమ్ ఆడుకుంటుండగా తనకూ కాసేపు ఫోన్ ఇవ్వమని బాలిక అడిగింది.
అతను ఇవ్వకపోవడంతో తమ్ముడి గొంతు నులిమి చంపేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.