Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రిసెప్షన్ వేదికపై భర్తకు మాజీ ప్రియుడిని పరిచయం చేసింది.. ఆపై కట్టిన తాళిని చేతిలోపెట్టేసింది?

మంగళవారం, 1 ఆగస్టు 2017 (13:09 IST)

Widgets Magazine

కళ్యాణ మండపం వేదికపై తన భర్తకు ఓ వధువు మాజీ ప్రేమికుడిని పరిచయం చేయడంతో ఆ వివాహం రద్దు అయిన సంఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళ, త్రిసూరుకు చెందిన జంట ఇటీవల గురువాయూరప్పన్ ఆలయంలో వివాహం ద్వారా ఒక్కటైంది. ఇటీవలే వీరిద్దరికీ రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకలో బంధువులు, స్నేహితులు హాజరరయ్యారు. ఆ సమయంలో వేదికపైకి వచ్చిన ఓ వ్యక్తిని.. వధువు తన మాజీ ప్రేమికుడని వరుడికి పరిచయం చేసింది. దీంతో కోపావేశానికి గురైన వరుడు.. తన మెడలో వున్న పూలమాలను తీసిపారేశాడు. 
 
వధువుపై పెద్దగా అరిచాడు. దీన్ని చూసిన వారంతా వేదికపై ఏం జరిగిందనే విషయం తెలియక షాక్ అయ్యారు. ఆపై వరుడి వద్ద విచారించడంతో అసలు విషయం బయటపడింది. వధువు పెళ్లికి ముందే ఒకరిని ప్రేమించిందని.. వివాహ రిసెప్షన్ వేడుకలో తనకు పరిచయం కూడా చేసిందని.. ఈ అమ్మాయి ఇక తనకొద్దని మండిపడ్డాడు. అప్పటికే వివాహం జరిగిపోవడంతో.. వరుడు, వధువు తరపు వారు కూర్చుని మాట్లాడుకున్నా ఫలితం లేకపోయింది. 
 
వధువు పెళ్లికి ముందే ప్రేమలో వున్న విషయం తెలియరావడంతో ఆమెతో కాపురం చేసేది లేదంటూ వరుడు తేల్చి చెప్పేశాడు. అంతేగాకుండా తాను కట్టిన తాళిని, వధువుకు తీసిచ్చిన లక్ష రూపాయల విలువైన సెల్ ఫోన్‌ను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశాడు. దీంతో వధువు వేరేదారి లేక ఆ వరుడు కట్టిన తాళిని, సెల్ ఫోన్‌ను తిరిగిచ్చేసింది. అంతటితో ఆగకుండా.. వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
పెళ్ళికి ముందే ప్రేమించిన విషయం దాచి, తనకు వివాహం చేసిన వధువు కుటుంబీకులపై కేసు పెట్టాడు. తనకు నష్టపరిహారంగా రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. కానీ రూ.లక్షలు వరుడికి ఇవ్వలేమని... రూ.8లక్షలు వరుడికి నష్టపరిహారంగా ఇస్తామని వధువు తల్లిదండ్రులు అంగీకరించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రూ. 24 కోట్లు అప్పు చేసిన 59 ఏళ్ల మహిళ... ఎగ్గొట్టేందుకు 30 ఏళ్ల యువతిలా మారిపోయింది...

అప్పులు ఇస్తే తీసుకోనివారెవరు...? ఐతే కొంతమందికి అప్పులు తీసుకోవడం అంటే చాలా భయం. మళ్లీ ...

news

జీవితాంతం గుర్తుండాలని పెళ్లి వేదిక వద్దకు పెళ్ళికొడుకు ఎలా వచ్చాడో తెలుసా (Video)

ప్రతి ఒక్కరూ తమ జీవితాంతం గుర్తుండిపోయేలా పెళ్లి జరగాలని కోరుకుంటారు. ఇందుకోసం పెళ్లికి ...

news

ఆగస్టు నెలలో లాంగ్ వీకెండ్స్‌తో పండగ చేస్కోండి...

ఈ యేడాది ఇతర నెలలతో పోల్చుకుంటే ఆగస్టు నెలలో అధికంగా వారాంతపు సెలవులు వచ్చాయి. ముఖ్యంగా ...

news

ప్రధాని మోడీకి షాకిచ్చిన బీజేపీ ఎంపీలు.. ఎక్కడ.. ఎందుకు?

భారతీయ జనతా పార్టీ ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తేరుకోలేని షాకిచ్చారు. పెద్దల సభ ...

Widgets Magazine