శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 29 మే 2015 (14:39 IST)

సల్మాన్ కేసు పత్రాలు కాలిపోయాయట.. సచివాలయ అగ్నిప్రమాదంలో..

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు హిట్ అండ్ రన్ కేసులో కాస్త ఊరట లభించిందనే చెప్పాలి. హిట్ అండ్ రన్ కేసులో కీలక పత్రాలు కాలిపోయినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం రావడంతో సల్మాన్ కాస్త ఊపిరిపీల్చుకున్నాడు. 2002లో సల్మాన్ ప్రయాణిస్తున్న కారు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నవారిమీదికి దూసుకెళ్లడంతో ఒకరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ఈ కేసులో ఇటీవల స్థానిక కోర్టు సల్మాన్‌కు ఐదేండ్ల శిక్ష విధించింది. 
 
అటు తర్వాత స్థానిక కోర్టు తీర్పును హైకోర్టు నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. 2002 నుంచి కేసును ప్రభుత్వం తరఫున వాదిస్తున్న లాయర్లతోపాటు, కేసు విచారణకు ప్రభుత్వం చేసిన ఖర్చు తదితర వివరాలు కావాలంటూ కొన్నాళ్ల క్రితం సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ముంబైకి చెందిన ఆర్టీఐ కార్యకర్త మన్సూర్ దర్వేష్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి పెట్టుకున్నారు.
 
కేసుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు కూడా తమ వద్ద లేవని, 2012లో మంత్రాలయ(మహారాష్ట్ర సచివాలయం)లో జరిగిన అగ్నిప్రమాదంలో అవి కాలిపోయాయని ప్రభుత్వం నుంచి ఆర్టీఐ కార్యకర్తకు సమాధానం వచ్చింది.