గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2023 (17:38 IST)

కొత్త పార్లమెంట్ ఫొటోలను విడుదల చేసిన మోదీ సర్కార్

new Parliament
new Parliament
భారత్ ప్రజలు ఎంతగానో ఆసక్తితో ఎదురుచూస్తున్న కొత్త పార్లమెంట్ భవనాన్ని ఈ నెలాఖరులో ఆవిష్కరించనున్నారు. భవన నిర్మాణానికి బాధ్యత వహిస్తున్న కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ త్రిభుజాకారంలో ఉన్న ఈ నిర్మాణం లోపలి భాగాల చిత్రాలను విడుదల చేసింది.
 
65,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కొత్త పార్లమెంటు భవనంలో అనేక ఆధునిక సౌకర్యాలు, ఫీచర్లు ఉన్నాయి. 
 
ఇందులో పెద్ద పెద్ద హాళ్లు, అత్యాధునిక లైబ్రరీ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కాన్స్టిట్యూషన్ హాల్ తో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కార్యాలయాలు, కమిటీ గదులు ఉన్నాయి. ప్రస్తుతం విడుదలైన ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.