శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 8 మార్చి 2020 (11:36 IST)

సోషల్‌ మీడియా నుంచి వైదొలగిన మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ సామాజిక మాధ్యమాల నుంచి వైదొలగారు. తన సామాజిక మాధ్యమాల అకౌంట్ల ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఘనవిజయాలు సాధించిన ఏడుగురు మహిళలు తమ అనుభవాలను పంచుకుటారని ఆయన పేర్కొన్నారు.

”అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా నారీ శక్తి స్ఫూర్తికి, విజయాలకు నమస్కరిస్తున్నాను. కొద్ది రోజుల క్రితం నేను చెప్పినట్లు (సోషల్‌ మీడియానుంచి) సైన్‌ ఆఫ్‌ చేస్తున్నాను.

ఈ రోజు మొత్తం ఏడుగురు మహిళా సాధకులు వారి జీవితానుభవనాలను పంచుకుంటారు. నా సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా మీతో సంభాషిస్తారు” అని మోడీ ట్వీట్‌ చేశారు.