మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 11 మార్చి 2019 (17:23 IST)

మోహన్ లాల్‌కు అత్యున్నత పద్మభూషణ్ అవార్డ్..

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ దక్షణాదిలోని ఉత్తమ నటులలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. విలక్షణ నటుడిగా పేరుపొందారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం మోహన్‌లాల్‌కి పద్మభూషన్ అవార్డును ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అందించే పద్మభూషన్ అవార్డు రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ అన్నారు. 
 
న్యూఢిల్లీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా మోహన్ లాల్ పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 
 
తనకు వ్యక్తిగతంగానూ, ఓ నటుడిగానూ ఇది పెద్ద అచీవ్‌మెంట్ అని పేర్కొన్నాడు. తాను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 41వ వసంతాలు పూర్తయ్యాయని, తన సహచర నటులు, కుటుంబసభ్యులు తన యొక్క సినీ ప్రయాణంలో వెంట ఉండి సహకారం అందించిన ప్రతి ఒక్కరూ తన విజయంలో భాగస్వాములేనని మోహన్ లాల్ అన్నారు.