బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 జూన్ 2024 (21:07 IST)

తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లకు రుతుపవనాలు... భారీ వర్షాలు

monsoon
కర్ణాటకలోని చాలా ప్రాంతాలు, మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు మరింతగా విస్తరించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం వెల్లడించింది. 
 
ఐఎండీ ప్రకారం, కర్ణాటక, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాలు, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు (ముంబైతో సహా), తెలంగాణా, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, అరేబియా సముద్రంలో మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. తదుపరి 3-4 రోజులలో పశ్చిమ బెంగాల్‌లో వర్షాలు కురిసే అవకాశం వుంది.
 
ఈ క్రమంలో జూన్ 8 నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, మహారాష్ట్ర, కోస్తా కర్ణాటకలో వర్షపాతం పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
 
జూన్ 7 వరకు వాయువ్య భారతదేశంలో వర్షపాతం కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. రాబోయే ఐదు రోజుల్లో తూర్పు భారతదేశం, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో హీట్‌వేవ్ పరిస్థితులు తప్పవు.