శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 మే 2020 (19:46 IST)

జూన్ ఒకటిన కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు

ఎండలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి తరుణంలో నైరుతి రుతుపవనాలు త్వరలో చిరుజల్లులుగా పలకరించనున్నాయి. అవును. జూన్ ఒకటిన కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. భారత వాతావరణ శాఖ అంచనా వేసిన దాని కన్నా ముందే వస్తున్నాయి.
 
అరేబియా సముద్రంలో మే 31 నుంచి జూన్ 4 మధ్య అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో రుతుపవనాలు ముందే వచ్చే అవకాశం ఉంది. జూన్ ఒకటి లేదా రెండు తేదీల్లో కేరళ తీరాన్ని తాకవచ్చని భారత వాతావరణ విభాగ డైరక్టర్ జనరల్ ఎం మహాపాత్ర తెలిపారు.
 
పశ్చిమ-మధ్యనే వున్న నైరుతి అరేబియా సముద్రంలో గురువారం అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం కారణంగా రాబోయే మూడు రోజుల్లో వాయువ్య దిశగా దక్షిణ ఒమన్, తూర్పు యెమెన్ తీరాల వైపు వెళ్ళే అవకాశం ఉంది. జూన్ 1 లేదా 2 తేదీలలో కేరళలో రుతుపవనాలు ప్రారంభమవుతాయని మహాపాత్ర వెల్లడించారు.