Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమ్మ పేరుతో కొత్త పార్టీ పెట్టనున్న దీపా జయకుమార్.. 17న అధికారిక ప్రకటన..?

బుధవారం, 11 జనవరి 2017 (16:07 IST)

Widgets Magazine
deepa jayakumar

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేన కోడలు దీపా జయకుమార్ అన్నాడీఎంకేతో ఎలాంటి సంబంధం లేకుండా కొత్త పార్టీని స్థాపించేందుకు రెడీ అయిపోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే జయలలిత పురట్చి తలైవి అనే పేరుంటే.. దీపాకు పురట్చిమలర్ (విప్లవ పుష్పం) అనే పేరు కూడా ఖరారైపోయింది. ఈ నేపథ్యంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీ.రామచంద్రన్ (ఎంజీఆర్) శత జయంతి రోజన అధికారికంగా తన రాజకీయ పార్టీ పేరు ప్రకటించనున్నట్లు దీపా తెలిపారు.
 
ఇకపోతే... దీపా కాబోయే ముఖ్యమంత్రి అంటూ అన్నాడీఎంకే కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. దీపా తమిళనాడు సీఎం అనే పేరుతో క్యాలెండర్లు, స్టిక్కర్లు చలామణిలోకి వచ్చేశాయి. కాగా ఈ నెల 17వ తేదీన తన రాజకీయ ఆరంగేట్రంపై ప్రకటన చేస్తానని దీపా వెల్లడించారు. అమ్మ (జయలలిత) పేరు, ప్రతిష్టలు నిలబెట్టేలా అందరూ ఆశిస్తున్నట్లే తన నిర్ణయం ఉంటుందని, తనపై అభిమానంతో తరలివచ్చే వారికోసం పనిచేస్తానని దీపా చెప్పారు. కచ్చితంగా తాను రాజకీయాల్లోకి వస్తానని దీపా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దీపతో శశికళకు ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు జోస్యం చెప్తున్నారు. 
 
దీప కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారని ఆ పార్టీకి "ఎంగల్ అమ్మ జయలలిత దీపా పేరవై (అవర్ మదర్ జయలలిత దీపా పేరవై) లేదా ఇలయ పురట్చి తలైవి దీపా పేరవై (యంగర్ రెవల్యూషనరీ లీడర్ దీపా పేరవై) అనే పేర్లు పరిశీలనలో ఉన్నాడు. ఈ పేర్లు పెరంబళూరు, సేలం, ఈరోడ్, దిండుక్కల్ వంటి ప్రాంతాల్లో బాగా వినిపిస్తున్నాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
More Outfits Support Jayalalithaa Niece Deepa Jayakumar

Loading comments ...

తెలుగు వార్తలు

news

చోరీ కేసులో జైలు శిక్ష: కంది కారాగారంలో ఫినాయిల్ తాగి ఖైదీ ఆత్మహత్య..

సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని కారాగారంలో ఖైదీ ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ...

news

జయలలిత ఆస్తులను జాతికి అంకితం చేయాలి.. మద్రాస్ హైకోర్టులో పిల్.. వారసులు లేరట..

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఇంకా మిస్టరీ వీడని నేపథ్యంలో.. ఆమె ఆస్తులపై ప్రస్తుతం ...

news

తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు.... ఈ సంవత్సరమైనా అనుమతి ఇచ్చేనా?

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తమిళనాడు ప్రాంత ప్రజలు సంప్రదాయంగా జరుపుకునే క్రీడ ...

news

కాశ్మీర్‌లోకి చొరబడిన టెర్రరిస్టులు... పాక్ సరిహద్దు మూసేస్తున్న చైనా.. యుద్ధానికి సిద్ధమైన తైవాన్

కాశ్మీర్ లోయల్లోని మంచు కొండల్లోకి తీవ్రవాదులు ప్రవేశించారు. జనవరి నెలలో భారత్‌లో ...

Widgets Magazine