సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 మే 2023 (11:14 IST)

పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ల కంటే ప్రేమ వివాహాలే పెటాకులవుతున్నాయ్: సుప్రీం

Love
విడాకులపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. అన్ని సందర్భాల్లో ఆరు నెలలు వ్యవధి వర్తించదని వ్యాఖ్యానించింది. విడాకులకు వెయిటింగ్ పీరియడ్ అక్కర్లేదని.. మధ్యవర్తిత్వం కుదరనప్పుడు వెంటనే విడాకులు మంజూరు చేయవచ్చునని వెల్లడించారు. 
 
పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లతో పోలిస్తే ప్రేమ పెళ్లిళ్లలోనే విడాకులు ఎక్కువని పేర్కొంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలే ఎక్కువగా విడాకుల కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నాయని సుప్రీంకోర్టు పేర్కొది. 
 
ఓ జంట విడాకుల కేసు విచారణలో భాగంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ కేసులో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కే అన్ని జంటలకూ ఆరు నెలల నిబంధన వర్తించదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.