గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2019 (11:48 IST)

బాలికపై అత్యాచారం.. ఆపై చంపేసి శవాన్ని పబ్లిక్ టాయ్‌లెట్‌లో పడేశాడు...

మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ కామాంధుడు తొమ్మిదేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ బాలికను హత్య చేసి.. పబ్లిక్ టాయ్‌లెట్‌లో పడేశారు. ఈ ఘటన ముంబైలోని నెహ్రూ నగర్ విలే పార్లా రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నెహ్రూ నగర్‌లోని చాల్‌కు చెందిన బాలిక గురువారం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు జుహూ పోలీస్‌ స్టేషనులో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు.. ఆ బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
 
ఇంతలో స్థానికంగా ఉండే ఓ పబ్లిక్ టాయ్‌లెట్‌లో బాలిక మృతదేహం ఉన్నట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా చేయించారు. 
 
ఈ శవపరీక్షలో బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసినట్టు తేలింది. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశాం. అతడిపై హత్యా, అత్యాచార, కిడ్నాప్‌ కేసులతో పాటుగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి లోతుగా విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.