ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 మే 2024 (11:09 IST)

బాలుడు ఖరీదైన కారు నడుపుతుంటే కారు బానెట్‌పై కూర్చొన్న యువకుడు..!!

car bonnet
ఇటీవల పూణె బాలుడు లగ్జరీ కారును డ్రైవింగ్ చేస్తూ ఇద్దరి ప్రాణాలు బలిగొన్న తీరుపై దేశం మొత్తం విస్మయం వ్యక్తం చేసింది. సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి బాలుడు, కారు ఇచ్చినందుకు అతడి తండ్రిని, డ్రైవర్‌ను ఇరికించేందుకు ప్రయతనించి దొరికిపోయిన బాలుడు తాతను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతుంది.
 
తాజాగా, ముంబై మహానగరంలో ఇలాంటి ఘటనే జరిగింది. కాకపోతే ప్రమాదం జరగలేదంతే. ఓ బాలుడు ఖరీదైన కారును నడుపుతుంటే మరో యువకుడు కారు బానెట్‌పై కూర్చొన్నాడు. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ఒకటైన శివాజీ చౌక్ వద్ద ఈ ఘటన జరిగింది. బాలుడు బీఎండబ్ల్యూ కారు నడుపుతుంటే శుభమ్ మితాలియా అనే మరో యువకుడు దర్జాగా కారు బానెట్‌పై కూర్చొన్నాడు.
 
ఈ వీడియో వైరల్ కావడంతో వెంటనే స్పందించిన పోలీసులు బాలుడికి కారు ఇచ్చినందుకు అతడి తండ్రిని అరెస్టు చేశారు. బాలట్‌పై కూర్చున్న యువకుడిని కూడా అరెస్టు చేసినట్టు తెలిసింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.