మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 సెప్టెంబరు 2021 (17:17 IST)

ముంబై నిర్భయ మృతి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత

దేశంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే వున్నాయి. ఎన్ని చట్టాలొచ్చినా మహిళలపై వయో బేధం లేకుండా అకృత్యాలు చోటుచేసుకుంటూనే వున్నాయి. నిర్భయ తరహాలో ముంబయిలో ఓ మహిళ దారుణంగా అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే.

సాకినాకా ప్రాంతంలో జరిగిన ఈ హేయమైన ఘటన దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ అత్యాచార ఘటనలో బాధితురాలు చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
 
శుక్రవారం ఓ మహిళపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి తెగబడిన దుండగులు, ఆమెను క్రూరంగా హింసించారు. ఇనుపరాడ్డును ఆమె మర్మాంగంలోకి చొప్పించడంతో తీవ్రరక్తస్రావమైంది. అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళను గట్కోపర్ రాజావాడి ఆసుపత్రికి తరలించారు. 
 
అయితే చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది. కాగా, ఈ కేసులో సీసీ టీవీ ఫుటేజి కీలకం కానుంది. ఈ ఘటన అనంతరం ఓ వ్యక్తి టెంపోలో పారిపోయినట్టు గుర్తించారు. ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం కూడా ఉందని భావిస్తున్నారు