శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 మే 2022 (19:24 IST)

తోటి ఖైదీపై అత్యాచారం చేసిన రేప్ కేస్ నిందితుడు

jail
ముంబైలోని అర్థరో రోడ్‌లో ఉన్న కేంద్ర కారాగారంలో అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీని రేప్ కేసులో అరెస్టు అయిన మరో నిందితుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ అసజ శృంగార వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ లైంగిక దాడిపై జైలు సిబ్బందికి బాధితుడు ఫిర్యాదు చేశాడు. 
 
ఈ జైలులో అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ... గత కొన్ని రోజులుగా ఓ ఖైదీ తనను లైంగికంగా వేధిస్తున్నాడని, తనపై అసహజ లైంగికి దాడికి పాల్పడుతున్నట్టు జైలు సిబ్బందికి బాధిత ఖైదీ పలుమార్లు ఫిర్యాదు చేశాడు. 
 
కానీ, జైలు సిబ్బంది ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆ ఖైదీ ఏకంగా జైలు ఉన్నతాధికారులను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నాడు. దీనిపై స్పందించిన అధికారులు బాధితుని ఫిర్యాదుపై పట్టించుకోని జైలు సిబ్బందికి నోటీసులు ఇచ్చారు. అలాగే, ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.