గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 ఆగస్టు 2022 (16:23 IST)

ముఖేష్ అంబానీకి బెదిరింపులు - ఒకరి అరెస్టు

mukesh ambani
భారత పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి ప్రాణహాని తలపెడతామంటూ బెదిరింపులు వచ్చాయి. దీనిపై ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. 
 
కాగా, ప్రాణహాని తలపెడతామంటూ అంబానీకి, ఆయన కుటుంబానికి ఒకే రోజు ఎనిమిది సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ నెంబరుకి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. 
 
మొత్తం ఎనిమిది సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ముంబైలోని డీబీ మార్గ్ పోలీస్ స్టేషనులో రిలయన్స్ ఫౌండేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఒకేరోజు ఎనిమిది కాల్స్ వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
ఈ సందర్భంగా ఓ సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ... రిలయన్స్ ఫౌండేషన్ నుంచి ఫిర్యాదు అందిందని చెప్పారు. మరోవైపు ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ముంబై వెస్ట్ సబర్బ్ ప్రాంతంలో అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ముఖేశ్ అంబానీ నివాసం ఎదుట పేలుడు పదార్థాలతో నింపిన స్కార్పియో వాహనం పార్క్ చేసి ఉండటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈ కారు యజమాని కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.