ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2016 (17:08 IST)

న‌ల్ల‌ధ‌నంపై యుద్ధం ప్ర‌క‌టించ‌డం పాపం చేసిన‌ట్ల‌వుతుందా? మనీ మనీ.. అన్నోళ్ళు మోడీ.. మోడీ అంటున్నారు

బడాబాబులు నల్లధనంతో దేశాన్ని దోచుకున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఇకపై వారికి చెడ్డరోజులు ప్రారంభమయ్యాయని హెచ్చరించారు. ఏనాడు బ్యాంకుల ముఖం చూడ‌ని కొంద‌రు కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న పెద్

బడాబాబులు నల్లధనంతో దేశాన్ని దోచుకున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఇకపై వారికి చెడ్డరోజులు ప్రారంభమయ్యాయని హెచ్చరించారు. ఏనాడు బ్యాంకుల ముఖం చూడ‌ని కొంద‌రు కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంతో బ్యాంకుల‌కు వెళుతున్నార‌న్నారు.

కొంద‌రు జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో దొంగ డ‌బ్బును జ‌మ‌చేస్తున్నార‌ని వారి భ‌ర‌తం కూడా ప‌డ‌తామ‌ని ప్ర‌ధాని అన్నారు. దేశంలో రోజులు మారాయ‌ని చెప్పిన ప్ర‌ధాని.. ఒకప్పుడు పేద‌వాడు ధ‌న‌వంతుల చుట్టూ తిరిగేవాడ‌ని …ఇప్పుడు ధ‌న‌వంతుడే పేద‌వాడి చుట్టూ తిరుగుతున్నాడ‌ని అన్నారు.  
 
వాట్స‌ప్‌లో ఓ వీడియో చూశానని.. కారులో ఉన్న ఓ పెద్దాయ‌న వ‌ద్ద‌కు భిక్షాట‌న చేస్తూ ఓ యాచ‌కుడు వెళ్లాడట‌. చిల్ల‌ర లేద‌ని చెప్ప‌డంతో వెంట‌నే ఆ యాచ‌కుడు త‌న వ‌ద్ద ఉన్న స్వైపింగ్ మెషీన్ తీసి డెబిట్ కార్డును స్వైప్ చేయాల‌ని కోరాడని స‌భ‌లో ప్ర‌ధాని చెప్పిన‌ప్పుడు ప్ర‌జ‌ల నుంచి క‌ర‌తాళ‌ధ్వ‌నులు వినిపించాయి. 70 ఏళ్ల నుంచి దేశంలో మూలుగుతున్న న‌ల్ల‌ధ‌నాన్ని వెలికితీసేందుకు త‌న‌తో క‌లిసి రావాల‌ని ప్ర‌జ‌ల‌కు మోడీ పిలుపునిచ్చారు
 
ప్ర‌జ‌లే త‌న‌కు హైక‌మాండ్ అని మోడీ వ్యాఖ్యానించారు. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని మొరాదాబాద్‌లో జ‌రిగిన బీజేపీ ప‌రివ‌ర్త‌న్ ర్యాలీలో ఆయ‌న ప్ర‌సంగించారు. దేశంలో పేద‌రికం నిర్మూలించ‌డ‌మే త‌న ప్ర‌భుత్వం ప్ర‌థ‌మ‌ క‌ర్త‌వ్య‌మ‌ని ప్ర‌ధాని అన్నారు. న‌ల్ల‌ధ‌నంపై యుద్ధం ప్ర‌క‌టించ‌డం పాపం చేసిన‌ట్ల‌వుతుందా అని మోడీ ప్ర‌శ్నించారు.

మొన్న‌టి వ‌ర‌కు మ‌నీ మ‌నీ అన్న‌వారు ఇప్పుడు మోడీ.. మోడీ అంటూ మంత్రం జ‌పిస్తున్నార‌న్నారు. అవినీతి దేశాన్ని నాశ‌నం చేసింద‌ని పేర్కొన్న ప్ర‌ధాని త‌ర్వ‌లో బీజేపీ ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌జ‌ల త‌ల‌రాత‌ను మారుస్తుంద‌ని వెల్ల‌డించారు.  మీ మొబైల్ ఫోన్‌లోనే మీకు బ్యాంకు ఉంటుంద‌ని చెప్పారు.