Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ విషయంలో మేము ఎవరి మాటను వినం... ప్రధానమంత్రి మోదీ

మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (13:57 IST)

Widgets Magazine

పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ రేంజిలో కాంగ్రెస్ పార్టీపైన మండిపడ్డారు. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులను తెచ్చింది ఎవరో ప్రజలకు తెలుసునన్నారు. ప్రజల అభివృద్ధి కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుందనీ, పార్టీల కోసం కాదని అన్నారు. తాము స్వాతంత్ర్య సమరంలో పాల్గొనకపోయినా దేశం కోసమే జీవిస్తున్నామనీ, దేశకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని అన్నారు.
 
లోక్ సభ సమావేశాల్లో ప్రధానమంత్రి మోదీ ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశానికి కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చిందని చూస్తే.... కుటుంబ పాలన ఇచ్చిందని తెలుస్తుందన్నారు. బినామీ చట్టం తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ చట్టాన్ని మాత్రం నోటిఫై చేయకుండా మరుగున ఎందుకు పడవేసిందో సమాధానం చెప్పాలన్నారు. తాము అధికారంలో వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని నోటిఫై చేశామన్నారు. 
 
దేశంలో అవినీతిపరులు, నల్లధనం వెనుకేసుకుంటున్నవారి దారులను ఒక్కొక్కటిగా మూసివేస్తున్నామనీ, అందులో భాగంగానే పెద్ద నోట్ల రద్దును అమలు చేశామన్నారు. మన ఆర్థిక వ్యవస్థ బలంగా వుండటమూ, దేశ ప్రజలు తమకు సహకరించడం వల్లనే ఇది సాధ్యమైందని వెల్లడించారు. దేశాభివృద్ధిని వెనుకకు లాగే సలహాలను, మాటలను తాము పట్టించుకోబోమని అన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

డీఎంకే ఎమ్మెల్యేలంతా రాజీనామా? తమిళనాడులో రాష్ట్రపతి పాలన!

తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు క్షణానికో విధంగా మారిపోతున్నాయి. దివంగత జయలలిత ప్రియనెచ్చెలి ...

news

జగన్‌ను నమ్మితే బిర్యానీ కాదు చిప్పకూడు ఖాయం.. పార్టీ భూస్థాపితమే: ఆర్‌.శ్రీనివాసరెడ్డి

పైడిపాళెంకు నీరొచ్చాక తెలంగాణ వదిలి నింపాదిగా కడప జిల్లాకు వచ్చి ప్రాజెక్టు వద్దకు వెళ్ళి ...

news

నా పీఏను తక్షణం తొలగించండి.. చంద్రబాబును కోరిన బాలకృష్ణ

హిందూపురంలో టీడీపీ శ్రేణులను ఓ ఆట ఆడుకుంటున్న పీఏ శేఖర్‌ను తక్షణం తొలగించాలని సినీ నటుడు, ...

news

అమ్మను తోసేశారు.. శశికళ సీఎంగా వద్దే వద్దన్న పాండ్యన్-పన్నీర్‌కే మళ్లీ పట్టం అంటోన్నకేంద్రం

తమిళనాడులో ఏం జరుగుతోంది.? కేంద్రం ఎవరిపై మొగ్గుచూపుతుంది? ఒకటి రెండు రోజులు గవర్నర్ ...

Widgets Magazine