శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 23 అక్టోబరు 2014 (12:53 IST)

సియాచిన్ యుద్ధక్షేత్రంపై ప్రధాని మోడీ దీపావళి సంబరాలు!

ప్రధాని నరేంద్ర మోడీ సియాచిన్ చేరుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రంపై అడుగు పెట్టారు. ఆయనతో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ కూడా ఉన్నారు. సియాచిన్ క్షేత్రంలో ప్రధానమంత్రి మోడీకి సైనికుల నుంచి ఘన స్వాగతం పలికారు. సైనికుల వందనాన్ని మోడీ స్వీకరించారు. 
 
అంతకుముందు దీపావళి పండుగను జమ్మూకాశ్మీర్ వరద బాధితులతో జరుపుకుంటానని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఆయన గురువారం శ్రీనగర్‌కు వెళ్లారు. అక్కడ వరద బాధితులతో ఆయన కొంత సమయాన్ని గడిపారు. అనంతరం భారత సైనికులతో గడపడానికి సియాచిన్‌కు చేరుకున్నారు. 
 
ప్రత్యేకమైన ఈ రోజును మన సైనికులతో గడపడానికి సియాచిన్ వెళుతున్నాను అని ట్వీట్ కూడా చేశారు. దేశంలోని ప్రతి పౌరుడూ మీ వెంటే ఉన్నాడు అన్న సందేశాన్ని సైనికుల కోసం తాను తీసుకెళుతున్నానని మోడీ తన ట్విట్ సందేశంలో పేర్కొన్నాడు. 
 
మరోవైపు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాకిస్థాన్ ముష్కర మూకలు కాల్పులతో స్వాగతం పలికాయి. మోడీ సియాచిన్ సెక్టార్ పర్యటన వేళ భారత్‌ను రెచ్చగొట్టేందుకు సరిహద్దులో పాక్ బలగాలు మరో సారి కాల్పులకు తెగబడ్డాయి. గురువారం ఉదయం, రామ్‌గఢ్ సెక్టార్‌లో భారత్ శిబిరాలపై పాక్ సైనికులు కాల్పులు జరిపారు.