Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విమానం ల్యాండ్ అవుతుంటే నాలుగు టైర్లూ పేలిపోయాయి... తర్వాత?

శుక్రవారం, 9 జూన్ 2017 (15:34 IST)

Widgets Magazine
tyre burst

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు చెందిన ఓ విమానం ల్యాండ్ అవుతుండగా దాని టైర్లు పేలిపోయాయి. దీంతో ఆ విమానంలోని ప్రయాణికులంతా బిగ్గరగా కేకలు వేస్తూ బెంబేలెత్తిపోయారు. శుక్రవారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఢిల్లీ నుంచి జమ్ము మీదుగా శ్రీనగర్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా (ఏఐ) 821 విమానం జమ్ము విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు సిద్ధమైంది. 
 
ఈ విమానం రన్ వేపై ల్యాండ్ అవుతుండగా విమానం టైర్లు పంక్చర్ అయ్యాయి. పెద్ద శబ్దం చేస్తూ నాలుగు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో విమానం ఒక్కసారిగా భారీ కుదుపునకులోనైంది. ఉన్నట్టుండి ఇలా జరగడంతో అందులోని ప్రయాణికులంతా హడలిపోయారు. అయితే పైలట్ విమానాన్ని అద్భుతంగా నియంత్రించి, సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. 
 
కాగా, శుక్రవారం మధ్యాహ్నం 11.05 గంటలకు ఢిల్లీలో బయలుదేరిన ఈ విమానం 12.20 నిమిషాలకు జమ్మూకు చేరుకుంది. ఆ సమయంలోనే ఈ విమానం టైర్లు పేలిపోయాయి. పిమ్మట టైర్లు మార్చాక జమ్మూ ఎయిర్‌పోర్టు నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి 1.45 గంటలకు శ్రీనగర్‌కు చేరుకుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చంద్రబాబు ఇంట్లో దేవాన్ష్ ఏడ్చినా.. జగన్ తొడబెల్లం పెట్టివుంటారని అంటారు : ఆర్కే.రోజా

రాష్ట్రమంత్రి నారా లోకేష్ కుమారుడు నారా దేవాన్ష్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్లో ...

news

కాల్ గర్ల్ అనుకుని ఆమెకు నీలి చిత్రాలు పంపా... విజయవాడలో కామాంధుడు...

చేతిలో ఫోన్ ఉంది... ఆపైన ఎన్ని కాల్స్ చేసినా, ఎన్ని సందేశాలు పెట్టినా, వీడియో కాల్స్... ...

news

ప్లాస్టిక్ రైస్ ఉందా? శ్రీవారి భక్తులకు వడ్డిస్తున్నారట..?

'అన్నం పరబ్రహ్మ స్వరూపం'.. అన్నదానానికి మించిన దానం లేదంటారు. ముఖ్యంగా మన భారతీయ ...

news

నాసా అంతరిక్ష ప్రయోగానికి ఎంపికైన భారత సంతతి వ్యక్తి రాజాచారి

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) త్వరలో ఎర్త్ ఆర్బిట్ అండ్ డీప్ స్పేస్ మిషన్ల ...

Widgets Magazine