ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 జులై 2022 (08:42 IST)

నేడు కూడా ఈడీ విచారణకు హాజరుకానున్న సోనియా

national herald
నేషనల్ హెరాల్డ్ పత్రికకు చెందిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కాంగ్రెస్ అధినేతల వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. ఇందులోభాగంగా, ఇప్పటికే కాంగ్రెస్ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వద్ద విచారణ జరిపిన ఈడీ అధికారులు ఇపుడు ఆయన తల్లి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్ద విచారణ జరుపుతున్నారు. 
 
ఇప్పటికే తొలి దఫాలో 3 గంటలు, రెండో దఫాలో 6 గంటల పాటు విచారణ జరిపారు. మూడో దఫాగా బుధవారం కూడా విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు సమన్లు ఇచ్చారు. దీంతో బుధవారం కూడా ఆమె హాజరుకానున్నారు. 
 
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ వద్ద ఈడీ అధికారులు తొలిసారి ఈ నెల 21వ తేదీన విచారణ జరిపిన విషయం తెల్సిందే. రెండు దఫాలుగా జరిపిన విచారణలో సోనియా వద్ద మొత్తం 9 గంటల పాటు విచారణ సాగింది. 
 
మరోవైపు, ఈ కేసులో రాహుల్, సోనియాల వద్ద ఈడీ అధికారులు విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే. దీంతో ఢిల్లీలోని ఈడీ కార్యాలయంతో పాటు ఏఐసీసీ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో పోలీస్ బలగాలను మొహరించారు.