బైక్ డ్రైవింగ్ నేర్పిస్తానని మహిళపై పార్కింగ్ చేసిన బస్సులో బలాత్కారం!
దేశంలో కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చి అమలు చేస్తున్నా వాటివల్ల ప్రయోజనం లేకుండా పోతోంది. మహారాష్ట్రలో తాజాగా 19 యేళ్ల మహిళపై అత్యాచారం జరిగింది. ఈ అఘాయిత్యానికి పాల్పడింది కూడా ఆమె స్నేహితులే కావడం గమనార్హం.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నవీ ముంబైలోని ఖర్గార్‌కు చెందిన 19 యేళ్ళ యువతికి బైక్ డ్రైవింగ్ నేర్పిస్తానని ఇద్దరు స్నేహితులు నమ్మించారు. దీంతో వారి మాటలు నమ్మి బైక్ నేర్చుకునేందుకు వెళ్ళింది. అయితే, ఆ యువతిని ఖర్గార్‌లోని ఉత్కర్ష్ హాలు సమీపంలో ఆపి ఉంచిన బస్సులోకి తీసుకువచ్చాడు.
అక్కడ ఆ యువతితో బలవంతంగా మద్యం తాగించి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం పిజ్జా డెలివరీ బాయ్‌ను కూడా పిలిపించాడు. డెలివరీ బాయ్ కూడా మహిళపై అత్యాచారం చేశాడు. అనంతరం మహిళను బస్సులోనే వదిలి పారిపోయారు.
బాధిత మహిళ మరుసటిరోజు విషయాన్ని తన కుటుంబసభ్యులకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన పిజ్జా డెలివరీ బాయ్‌ను అరెస్టు చేశారు. మరో కీలక నిందితుడు డ్రైవరు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని ముంబై పోలీసులు చెప్పారు.