గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 29 మే 2017 (18:03 IST)

సీర్పీఎఫ్ జవాన్లు దేశం కోసం చనిపోలేదు.. సైనా, అక్షయ్‌కు మావోల కౌంటర్

ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లాలో మార్చి నెలలో మావోలు జరిపిన ఆకస్మిక దాడిలో 27 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మావోల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు రూ.9లక్షల చొప్పున బా

ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లాలో మార్చి నెలలో మావోలు జరిపిన ఆకస్మిక దాడిలో 27 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మావోల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు రూ.9లక్షల చొప్పున బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఆర్థిక సాయం ప్రకటించాడు. అలాగే  బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్.. రూ.50వేల చొప్పున సాయం అందిస్తానని తన 27వ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆర్థిక సాయం ప్రకటించింది. అయితే సైనా, అక్షయ్ ఈ ఆర్థిక సాయాన్ని ప్రకటించడం పట్ల మావోయిస్టులు మండిపడ్డారు. 
 
అంతేగాకుండా మావో దాడిలో మృతి చెందిన సీఆర్పీఎఫ్ కుటుంబాలకు సైనా-అక్షయ్ ఆర్థిక సాయం చేయడంపై మావో కౌంటర్ ఇచ్చారు. సినీ నటులు, క్రీడాకారులు, ప్రముఖులు పేదల పక్షాన నిలబడాలని మావోలు హితవు పలికారు. మానవ హక్కుల ఉల్లంఘనలకు, పోలీసుల వేధింపులకు వ్యతిరేకంగా గళమెత్తాలని పిలుపునిచ్చారు. సీఆర్పీఎఫ్ జవాన్లు దేశం కోసం చనిపోవట్లేదని.. వాళ్లు రెబల్స్ చేతిలో వారు హతమైనారనే విషయాన్ని సెలెబ్రిటీలు గుర్తు పెట్టుకోవాలని మావోలు సూచించారు.