Widgets Magazine

పరప్పన జైలులో యూనిఫామ్ వేసుకోని శశికళ, ఇళవరసి..

సోమవారం, 12 మార్చి 2018 (12:25 IST)

parappana agrahara jail

అక్రమాస్తుల కేసులో జైలు జీవనం గడుపుతున్న చిన్నమ్మ మళ్లీ వార్తల్లోకెక్కింది. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ.. జైలులో వుండట్లేదని హ్యాపీగా షాపింగ్‌కు వెళ్తూ షికార్లు చేస్తుందని గతంలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీకే శశికళ, ఆమె బంధువు ఇళవరసి ఖైదీల యూనిఫాం ధరించడం లేదని నేషనల్ కమిషన్ ఫర్ ఉమన్ ఛైర్ పర్సన్ తెలిపారు. 
 
తనిఖీల్లో భాగంగా పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు వెళ్లగా అక్కడ శశికళ, ఇళవరసి ఇద్దరూ యూనిఫామ్ ధరించలేదని.. మహిళా ఖైదీలు ధరించే దుస్తులు కాకుండా సొంత దుస్తులను ధరించారని తెలిపారు. దానిపై తాను జైలు సిబ్బందిని ప్రశ్నించగా, శశికళ ఉన్నత స్థాయికి చెందిన వారని, ఆమె సొంత బట్టలు వాడుకోవచ్చని సమాధానమిచ్చివట్లు రేఖా శర్మ వెల్లడించారు. 
 
ఇదిలా ఉంటే.. ఇటీవల బెంగళూరు జైలులో శశిక‌ళ‌కు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నార‌ని నిజాలను బయటపెట్టిన కర్ణాటక జైళ్లశాఖ డీఐజీ రూపను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. జైళ్ల శాఖ డీఐజీ పదవి నుంచి తప్పించిన రూపను.. ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేశారు. రూప గతంలో శశికళకు పరప్పన జైలులో రాచమర్యద ఇస్తున్నారని, రూ.2 కోట్ల లంచం తీసుకుని శ‌శిక‌ళ‌కు వీఐపీ సౌక‌ర్యాలు క‌లిపిస్తున్నార‌ని రూప మీడియాకు తెలిపిన సంగతి తెలిసిందే.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

టర్కీ విమానం అలా కూలిపోయింది.. 11 మంది మహిళలు సజీవదహనం

ఇటీవల ఇరాన్‌కు చెందిన రెండు ఇంజిన్ల టర్బోప్రోప్ విమానం కూలిన ఘటనలో 65 మంది ప్రాణాలు ...

news

తప్పతాగి కారు నడిపిన యువతి.. ఇద్దరు స్టూడెంట్లు దుర్మరణం.. ఎక్కడ?

మద్యం సేవించి ఓ యువతి కారు నడపడంతో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోని ...

news

మోదీపై అంత విశ్వాసం వుంటే.. ఇక అవిశ్వాసం ఎందుకయ్యా?: బాబు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఇస్తారనే నమ్మకం తనకుందని వైసీపీ ఎంపీ ...

news

జాతిపితను చంపిన గాడ్సే నెం.1 హిందూ టెర్రరిస్ట్: అసదుద్ధీన్ ఓవైసీ

హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతిపిత మహాత్మ ...

Widgets Magazine