1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (14:49 IST)

శశికళ సీయమ్మా...? మేం పారిపోతాం... కామెంట్స్ వెల్లువ

అనుకున్నదే జరుగుతోంది. అన్నాడీఎంకే పతనం ఇంకా ఎంతో దూరంలో లేనట్లు తెలుస్తోంది. తమిళనాడులో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో నెటిజన్లు ఓ రేంజిలో ఫైర్ అవుతున్నారు. శశికళ సీఎం పీఠాన్ని అధిష్టిస్తుంటే చూస్తూ కూర్చోబోమని కామెంట్లు పెడుతున్నారు. శశ

అనుకున్నదే జరుగుతోంది. అన్నాడీఎంకే పతనం ఇంకా ఎంతో దూరంలో లేనట్లు తెలుస్తోంది. తమిళనాడులో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో నెటిజన్లు ఓ రేంజిలో ఫైర్ అవుతున్నారు. శశికళ సీఎం పీఠాన్ని అధిష్టిస్తుంటే చూస్తూ కూర్చోబోమని కామెంట్లు పెడుతున్నారు. శశికళ సీఎం అయిన వెంటనే తామంతా పారిపోతాం అంటూ మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు. 
 
ఇంకోవైపు కమల్ హాసన్ ట్వీట్ చేస్తూ ఎంతో విజయవంతంగా దూసుకువెళ్లే రథాన్ని అందమైన నెమలి ఈకలు కూల్చేయగలవని పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం తమిళనాడులో చోటుచేసుకున్న పరిస్థితులను అద్దం పడుతోంది. మరోవైపు క్రికెటర్ అశ్విన్ కూడా తమిళనాడులో కొత్తగా 234 మంది యువతకు ఉద్యోగాలు దొరకబోతున్నాయంటూ ట్వీటారు. ఈయన కామెంట్ తమిళనాడు అసెంబ్లీ నియోజకవర్గాలనుద్దేశించి చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే తమిళనాడు నియోజకవర్గాల సంఖ్య 234.